గూగుల్‌ స్టార్‌

గూగుల్‌ మెసేజెస్‌ వాడేవారికి శుభవార్త. దీనికి ప్రత్యేకమైన స్టార్‌ మెసేజెస్‌ ఫీచర్‌ తోడైంది. ముఖ్యమైన మెసేజ్‌లను స్టార్‌ గుర్తుతో మార్క్‌ చేసుకుంటే వాటిని తేలికగా పోల్చుకోవచ్చు.

Published : 14 Dec 2022 00:56 IST

గూగుల్‌ మెసేజెస్‌ వాడేవారికి శుభవార్త. దీనికి ప్రత్యేకమైన స్టార్‌ మెసేజెస్‌ ఫీచర్‌ తోడైంది. ముఖ్యమైన మెసేజ్‌లను స్టార్‌ గుర్తుతో మార్క్‌ చేసుకుంటే వాటిని తేలికగా పోల్చుకోవచ్చు. మరి దీన్నెలా ఎనేబుల్‌ చేసుకోవాలో తెలుసా?

* స్మార్ట్‌ఫోన్‌లో మెసేజెస్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి.

* యాప్‌లో స్టార్‌ గుర్తును పెట్టుకోవాలని భావిస్తున్న ఛాట్‌ను ఓపెన్‌ చేయాలి.

* అందులో ముఖ్యమైన మెసేజ్‌లను ఎంచుకొని, స్టార్‌ గుర్తును పెట్టుకోవాలి.

* స్టార్‌ గుర్తు పెట్టుకున్న మెసేజ్‌లను కన్వర్జేషన్‌ హిస్టరీ ద్వారా చూసుకునే వీలుంది కూడా. సెర్చ్‌ కన్వర్జేషన్స్‌ మీద ట్యాప్‌ చేసి, స్టార్డ్‌ ఆప్షన్‌ను ఎంచుకుంటే అవన్నీ కనిపిస్తాయి. మోర్‌ ఆప్షన్‌ ద్వారానూ వీటిని చూసుకోవచ్చు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని