280 నుంచి 4వేలకు

ఇకపై ట్విటర్‌ పొడుగు సందేశాల వేదికగా మారనుంది. ఇందులో పోస్ట్‌ చేసే సందేశాల్లోని అక్షరాల సంఖ్య 280 నుంచి 4వేలకు పెరగనుంది మరి. ఈ విషయాన్ని ఎలాన్‌ మస్క్‌ ధ్రువీకరించారు కూడా.

Published : 14 Dec 2022 00:56 IST

కపై ట్విటర్‌ పొడుగు సందేశాల వేదికగా మారనుంది. ఇందులో పోస్ట్‌ చేసే సందేశాల్లోని అక్షరాల సంఖ్య 280 నుంచి 4వేలకు పెరగనుంది మరి. ఈ విషయాన్ని ఎలాన్‌ మస్క్‌ ధ్రువీకరించారు కూడా. మొదట్లో ట్విటర్‌ సందేశాలకు 140 అక్షరాల పరిమితి ఉండేది. దీన్ని 2017లో 280కి పెంచారు. అంతకన్నా పెద్ద సందేశాలనైతే థ్రెడ్‌ రూపంలో వరుసగా పోస్ట్‌ చేసుకోవచ్చు. అక్షరాల సంఖ్యను 4వేలకు పెంచితే ట్విటర్‌లోనూ ఫేస్‌బుక్‌, లింక్డ్‌ఇన్‌ మాదిరిగా బ్లాగులు రాసుకోవటానికి వీలవుతుంది. అక్షరాల పెంపుపై ట్విటర్‌ యూజర్లు మిశ్రమ స్పందనలను వెలిబుచ్చుతున్నారు. పొట్టి సందేశాలను ఇష్టపడేవారు మూతి విరుస్తుంటే.. పొడుగు సందేశాలను ఇష్టపడేవారు స్వాగతిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని