వాట్సప్‌లో ‘ఒరిజినల్’ ఫొటో షేరింగ్
వాట్సప్‌లో ఫొటోలను షేర్ చేసుకుంటూనే ఉంటాం. కాకపోతే ఇవి కంప్రెస్ అయ్యాక షేర్ అవుతాయి. దీంతో ఒరిజినల్ క్వాలిటీలో ఫొటోలను షేర్ చేయటం సాధ్యం కాదు.
వాట్సప్‌లో ఫొటోలను షేర్ చేసుకుంటూనే ఉంటాం. కాకపోతే ఇవి కంప్రెస్ అయ్యాక షేర్ అవుతాయి. దీంతో ఒరిజినల్ క్వాలిటీలో ఫొటోలను షేర్ చేయటం సాధ్యం కాదు. ఇకపై అలాంటి ఇబ్బందేమీ ఉండదు. త్వరలో ఒరిజినల్ క్వాలిటీలో ఫొటోలను షేర్ చేసుకునే సదుపాయం అందుబాటలోకి రానుంది. ఆండ్రాయిడ్ 2.23.2.11 అప్‌డేట్‌తో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నారు. డ్రాయింగ్ టూల్ హెడర్‌లోనే ఈ కొత్త సెటింగ్ గుర్తు కనిపిస్తుంది. దీని ద్వారా ఇమేజ్ క్వాలిటీని నిర్ణయించుకోవచ్చు. ఇందులో ఒరిజినల్ క్వాలిటీ కూడా ఉంటుంది. ఫొటోల క్వాలిటీని ఎంచుకునే విషయంలో ఇది మరిన్ని అవకాశాలను కల్పిస్తుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.