Whatsapp: వాట్సప్‌.. ఇక చిటికెలో ఫాంట్‌ను మార్చుకోవచ్చు!

వాట్సప్‌లో ఎన్నెన్నో సందేశాలు పంపిస్తుంటాం. టెక్స్ట్‌ సందేశాలకు కొదవే లేదు. అందుకే దీన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దటంపై వాట్సప్‌ దృష్టి సారించింది.

Updated : 08 Feb 2023 09:17 IST

వాట్సప్‌లో ఎన్నెన్నో సందేశాలు పంపిస్తుంటాం. టెక్స్ట్‌ సందేశాలకు కొదవే లేదు. అందుకే దీన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దటంపై వాట్సప్‌ దృష్టి సారించింది. డ్రాయింగ్‌ టూల్‌ కోసం టెక్స్ట్‌ ఎడిటర్‌ను సరికొత్తగా తీర్చిదిద్దుతోంది. దీనికి కొత్త ఫీచర్లను జోడించనుంది. వీటిల్లో ఒకటి చిటికెలో ఫాంట్‌ను మార్చుకోవటం. కీబోర్డు మీద కనిపించే ఫాంట్‌ ఆప్షన్స్‌ మీద ట్యాప్‌ చేసి, ఇష్టమైన ఫాంట్‌లను ఎంచుకోవచ్చు. రెండో ఫీచరేమో టెక్స్ట్‌ అమరికను మారుస్తుంది. దీంతో ఫొటోలు, వీడియోల మీద కుడి, ఎడమ, మధ్య.. ఇలా ఎక్కడైనా పదాలను, వాక్యాలను అమర్చుకోవచ్చు. మూడోదేమో అక్షరాల వెనక భాగాన్ని మార్చుకోవటానికి వీలు కల్పిస్తుంది. దీని ద్వారా ముఖ్యమైన అంశాన్ని ప్రస్ఫుటంగా కనిపించేలా చేయొచ్చు. తదుపరి అప్‌డేట్‌తో ఈ కొత్త టెక్స్ట్‌ ఎడిటర్‌ అందుబాటులోకి రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని