టెలిగ్రామ్ సరికొత్తగా
రోజురోజుకీ ఆదరణ పెంచుకుంటోన్న సామాజిక మాధ్యమ వేదిక టెలిగ్రామ్ సరికొత్త రూపు సంతరించుకుంది. ఎమోజీలు, ప్రొఫైల్ పిక్చర్, అనువాదం వంటి వాటి కోసం కొత్త ఫీచర్లతో ముస్తాబయ్యింది.
రోజురోజుకీ ఆదరణ పెంచుకుంటోన్న సామాజిక మాధ్యమ వేదిక టెలిగ్రామ్ సరికొత్త రూపు సంతరించుకుంది. ఎమోజీలు, ప్రొఫైల్ పిక్చర్, అనువాదం వంటి వాటి కోసం కొత్త ఫీచర్లతో ముస్తాబయ్యింది.
* స్టికర్‌నో, యానిమేటెడ్ ఎమోజీనో ప్రొఫైల్ పిక్చర్‌గా మార్చుకోవాలకునే వారి కోసం ప్రొఫైల్ ఫొటో మేకర్ సదుపాయాన్ని కల్పించారు. దీన్ని అకౌంట్స్, ఛానెల్స్‌తో పాటు అన్ని గ్రూపుల్లోనూ వాడుకోవచ్చు. ఇది ప్రీమియం యూజర్లకే కాదు, అందరికీ అందుబాటులో ఉండటం విశేషం.
* ఏదో ఒక్క ఛాట్‌ను కాదు.. మొత్తం ఛాట్లను, గ్రూపులను, ఛానెళ్లను అప్పటికప్పుడు అనువాదం చేసి పెట్టే ఫీచర్ మరో ప్రత్యేకత. తెర మీద కనిపించే ‘ట్రాన్స్‌లేట్’ బార్ మీద తాకితే చాలు. మొత్తం అనువాదం అవుతాయి. అయితే గంపగుత్త అనువాద సదుపాయం ప్రీమియం యూజర్లకే అందుబాటులో ఉంది. మిగతావారైతే ఒక్కో మెసేజ్‌ను ఎంచుకొని అనువాదం చేసుకోవాల్సి ఉంటుంది.
* టెలిగ్రామ్ యాప్‌ను వాడుతూనే ఉంటాం గానీ ఎంత డేటా తీసుకుందో తెలుసుకునేదెలా? ఇందుకోసం నెట్‌వర్క్ యూసేజ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీంతో వినియోగించుకున్న మొబైల్ డేటానే కాదు, వైఫై డేటా కూడా తెలుసుకోవచ్చు. మీడియా సందేశాలను ఆటో సేవ్ చేసుకునే ఫీచర్ కూడా తోడయ్యింది. మీడియా ఎప్పుడు సేవ్ కావాలో దీంతో ఎంచుకోవచ్చు. అంటే అవసరమైన మీడియా సందేశాలనే సేవ్ అయ్యేలా చూసుకోవచ్చన్నమాట.
* ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగా ఎమోజీలను విభజించుకునే ఫీచర్‌నూ తీసుకొచ్చారు. దీంతో ఎమోజీలను వివిధ వర్గాలుగా విభజించుకోవచ్చు. కొత్త అప్‌డేట్‌తో లక్షలాది ఎమోజీలు, స్టికర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. సందర్భానికి అనుగుణమైన ఎమోజీని ఎంచుకొని, పంపించుకోవటమే తరువాయి.
* గ్రూపు అడ్మిన్ల కోసం మీడియా పర్మిషన్స్ ఫీచర్ కూడా వచ్చింది. దీంతో గ్రూపు సభ్యులు ఎలాంటి మీడియాను వాడుకోవచ్చో అడ్మిన్లు నిర్ణయించొచ్చు. మీడియా ఓన్లీ గ్రూపులను సృష్టించటానికి టెక్స్ట్ మేసేజ్‌లను డిసేబుల్ చేయొచ్చు కూడా.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
కన్నతండ్రి దూరమైనా తరగని ప్రేమ.. భౌతికకాయం ముందే పెళ్లి చేసుకున్న కుమారుడు
-
India News
Usha Gokani: మహాత్మాగాంధీ మనవరాలి కన్నుమూత
-
Politics News
TDP: ఎమ్మెల్యే భవాని సభలో లేకున్నా ‘సాక్షి’లో తప్పుడు ఫొటో: తెదేపా ఎమ్మెల్యే స్వామి
-
India News
the elephant whisperers: ఆస్కార్ లఘుచిత్ర దర్శకురాలికి రూ.కోటి నజరానా
-
India News
వాహ్.. బేటా!.. తాజ్ చూపించి తల్లి కోరిక తీర్చిన తనయుడు
-
Crime News
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి