యూట్యూబ్‌లో పాడ్‌కాస్ట్‌

వీడియో షేరింగ్‌ వేదిక యూట్యూబ్‌ చడీచప్పుడు లేకుండా కొత్త ఫీచర్‌ ప్రయోగాన్ని ఆవిష్కరించింది. ఇది పాడ్‌కాస్ట్‌ల కోసం కొత్త టూల్స్‌ను పరీక్షించటానికి ఉపయోగపడుతుంది

Published : 22 Feb 2023 00:15 IST

వీడియో షేరింగ్‌ వేదిక యూట్యూబ్‌ చడీచప్పుడు లేకుండా కొత్త ఫీచర్‌ ప్రయోగాన్ని ఆవిష్కరించింది. ఇది పాడ్‌కాస్ట్‌ల కోసం కొత్త టూల్స్‌ను పరీక్షించటానికి ఉపయోగపడుతుంది. అప్‌లోడింగ్‌ దగ్గర్నుంచి డేటా విశ్లేషణ డిస్‌ప్లే వరకూ పాడ్‌కాస్ట్‌లను సృష్టించేవారికి అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తుంది. ఈ పరీక్ష అవకాశాన్ని కల్పించిన యూజర్లకు క్రియేట్‌ బటన్‌ కింద పాడ్‌కాస్ట్‌ను పోస్ట్‌ చేసే ఆప్షన్‌ కనిపిస్తుంది. ప్రస్తుతం క్రియేట్‌ బటన్‌తో వీడియోలను అప్‌లోడ్‌ చేయటం, టెక్స్ట్‌ పోస్ట్‌ను సృష్టించటం, ప్రత్యక్ష ప్రసారాలను ఆరంభించటం అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు దీనికి కొత్తగా పాడ్‌కాస్ట్‌ సదుపాయమూ తోడైంది. కంటెంట్‌ మెనూలోని కొత్త పాడ్‌కాస్ట్‌ ట్యాబ్‌ నుంచీ క్రియేటర్లు పాడ్‌కాస్ట్‌లను యాక్సెస్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ప్లేలిస్టులనూ పాడ్‌కాస్ట్‌లుగా సెట్‌ చేసుకోవచ్చు. ఈ మార్పులు కొద్దిమంది యూజర్లకే.. అదీ డెస్క్‌టాప్‌ మీదే కనిపిస్తాయని గూగుల్‌ చెబుతోంది. ఇదేకాకుండా యూట్యూబ్‌ ఇటీవల ‘గో లైవ్‌ టుగెదర్‌’ ఫీచర్‌నూ ప్రవేశపెట్టింది. దీంతో క్రియేటర్లు ఇతరులతో కలిసి సంయుక్తంగా ప్రత్యక్ష ప్రసారాలు చేసుకోవచ్చు. ఫోన్‌లో అతిథినీ ఆహ్వానించొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు