ట్విటర్‌ ఫాలోవర్‌ను తొలగించేదెలా?

ట్విటర్‌లో ఎక్కువమంది ఫాలోవర్లు ఉండటం గొప్ప విషయమే. అయితే సంఖ్య ఎక్కువగా ఉండటమే కాదు, మంచి ఫాలోవర్లు ఉండటమూ ముఖ్యమే.

Published : 22 Feb 2023 00:15 IST

ట్విటర్‌లో ఎక్కువమంది ఫాలోవర్లు ఉండటం గొప్ప విషయమే. అయితే సంఖ్య ఎక్కువగా ఉండటమే కాదు, మంచి ఫాలోవర్లు ఉండటమూ ముఖ్యమే. అప్పుడే మన అభిప్రాయాలు ఎక్కువమందికి చేరటానికి అవకాశముంటుంది. కాబట్టి జాబితాను పరిశీలించి, సరిపడని ఫాలోవర్లను తొలగించుకోవటమే మంచిది. దీన్ని తేలికగానే చేసుకోవచ్చు.
డెస్క్‌టాప్‌ మీద..
* ట్విటర్‌ ఖాతాకు లాగిన్‌ కావాలి.
* ఎడమవైపు జాబితాలో కనిపించే ప్రొఫైల్‌ మీద క్లిక్‌ చేయాలి.
* ఫాలోవర్స్‌ మీద క్లిక్‌ చేస్తే వారి జాబితా కనిపిస్తుంది.
* ఫాలోవర్‌ పేరు పక్కన ఉండే అడ్డం మూడు చుక్కల మీద నొక్కితే మ్యూట్‌, రిమూవ్‌, బ్లాక్‌, రిపోర్టు ఫీచర్లు ఉంటాయి. వీటిల్లో రిమూవ్‌ ఫాలోవర్‌ను ఎంచుకుంటే సరి.
- ట్విటర్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ఫాలోవర్లను తొలగించుకోవటానికి వీలుండదు. కాబట్టి మొబైల్‌ ఫోన్‌లోనైతే ట్విటర్‌ వెబ్‌బ్రౌజర్‌ ద్వారా లాగిన్‌ అయ్యి రిమూవ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని