కొత్త సోషల్‌ న్యూస్‌ యాప్‌

ఇన్‌స్టాగ్రామ్‌ సహ వ్యవస్థాపకులు కెవిన్‌ సీస్ట్రోమ్‌, మైక్‌ క్రీగర్‌ సంయుక్తంగా కొత్త న్యూస్‌ యాప్‌ను సృష్టించారు.

Published : 01 Mar 2023 00:11 IST

ఇన్‌స్టాగ్రామ్‌ సహ వ్యవస్థాపకులు కెవిన్‌ సీస్ట్రోమ్‌, మైక్‌ క్రీగర్‌ సంయుక్తంగా కొత్త న్యూస్‌ యాప్‌ను సృష్టించారు. కృత్రిమ మేధ సాయంతో పనిచేసే దీని పేరు ఆర్టిఫ్యాక్ట్‌. కొత్త సోషల్‌ ఫీచర్లతో ఇటీవలే ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతానికి బీటా దశలోనే ఉంది. సైనప్‌ అవసరం లేకుండా ఇష్టమైన వార్తాంశాలను అందించటం ఆర్టిఫ్యాక్ట్‌ లక్ష్యం. హిస్టరీ ఆధారంగానూ వార్తలను చూపిస్తుంది. దీనిలోని సోషల్‌ ఫీచర్‌ ద్వారా యూజర్లు తమ కాంటాక్టులను జతచేయొచ్చు. దీంతో స్నేహితులు ఎలాంటి కథనాలను చదువుతున్నారనేది తెలుస్తుంది. అయితే ఎవరెవరు ఏయే కథనాలు చదివారు? ఎన్ని కథనాలు చదివారు? అనేది వెల్లడించదు. వార్తా కథనాలను యాప్‌లో షేర్‌ చేసుకోవటానికి, కామెంట్‌ చేయటానికి వీలు కల్పించే ఫీచర్లనూ దీనికి జోడించనున్నారు. ఈ యాప్‌ కథనాలను అంశాల వారీగా వర్గీకరిస్తుంది కూడా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని