గంపగుత్తగా ఈమెయిళ్ల అన్‌సబ్‌స్క్రయిబ్‌

ఏవేవో వెబ్‌సైట్లు. అవసరం కొద్దీ సబ్‌స్క్రయిబ్‌ చేసుకుంటాం. క్రమంగా వీటి ఈమెయిళ్లతో ఇన్‌బాక్స్‌ నిండిపోతుంది. అనవసరమైనవీ వచ్చి చేరుతుంటాయి.

Published : 12 Apr 2023 00:08 IST

వేవో వెబ్‌సైట్లు. అవసరం కొద్దీ సబ్‌స్క్రయిబ్‌ చేసుకుంటాం. క్రమంగా వీటి ఈమెయిళ్లతో ఇన్‌బాక్స్‌ నిండిపోతుంది. అనవసరమైనవీ వచ్చి చేరుతుంటాయి. వీటన్నింటినీ గంపగుత్తగా అన్‌సబ్‌స్క్రయిబ్‌ చేసుకోవాలంటే?https://unroll.me/  వెబ్‌సైట్‌ ఉందిగా. దీనిలో సైన్‌ ఇన్‌ అయ్యి, అవసరం లేని ఈమెయిళ్ల బెడదను ఒకేసారి తొలగించుకోవచ్చు. ఇది మన ఈమెయిల్‌ అడ్రస్‌ నుంచి ఆయా వెబ్‌సైట్లకు అన్‌సబ్‌స్క్రయిబ్‌ రిక్వెస్ట్‌లను పంపుతుంది. వాటి నుంచి అందే అన్‌సబ్‌స్క్రయిబ్‌ లింక్‌ను గుర్తించి, తనకు తానే క్లిక్‌ చేసేస్తుంది. దీంతో 24 గంటల తర్వాత ఎంచుకున్న మెయిళ్లనీ అన్‌సబ్‌స్క్రయిబ్‌ అవుతాయి. ఏవైనా కారణాలతో అన్‌స్క్రయిబ్‌ రిక్వెస్ట్‌ను వెబ్‌సైట్లు తిరస్కరించినా వాటి నుంచి ఎలాంటి మెయిళ్లూ అందవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని