హెచ్‌పీ కొత్త పెవిలియన్‌ నోట్‌బుక్స్‌

యువతరం అవసరాలను దృష్టిలో పెట్టుకొని హెచ్‌పీ ఇటీవల మనదేశంలో కొత్త పెవిలియన్‌ ప్లస్‌ నోట్‌బుక్స్‌ను ప్రవేశపెట్టింది.

Published : 26 Apr 2023 00:34 IST

యువతరం అవసరాలను దృష్టిలో పెట్టుకొని హెచ్‌పీ ఇటీవల మనదేశంలో కొత్త పెవిలియన్‌ ప్లస్‌ నోట్‌బుక్స్‌ను ప్రవేశపెట్టింది. 13వ జెన్‌ ఇంటెల్‌కోర్‌ ప్రాసెసర్‌, తేలికైన డిజైన్‌, గోప్యత కోసం మ్యానువల్‌ కెమెరా షటర్‌ డోర్‌తో కూడిన వీటిని ఉరుకుల పరుగుల జీవనశైలి, వైవిధ్య కంప్యూటింగ్‌ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దింది. ఇంట్లో, బయట ఎక్కడైనా పని చేయటానికి వీలుగా.. మరింత వినోదాన్ని ఆస్వాదించేలా మల్టీ టచ్‌ సామర్థ్యాలను జోడించింది. కంటికి హాని కలిగించని ఓఎల్‌ఈడీ తెర దీని ప్రత్యేకత. 400 ఎన్‌ఐటీల ప్రకాశంతో దృశ్యాలను స్పష్టంగా చూపిస్తుంది. టెంపోరల్‌ నాయిస్‌ రిడక్షన్‌తో కూడిన హెచ్‌పీ రిజల్యూషన్‌ హెచ్‌పీ ట్రూ విజన్‌ 5ఎంపీ కెమెరా, ఏఐ నాయిస్‌ రిడక్షన్‌ ఫీచర్లతో అలరిస్తోంది. ఒకేసారి ఎక్కువ పనులు చేసుకోవటానికి వీలుగా పలు యూఎస్‌బీ పోర్టులతో పాటు యూఎస్‌బీ సి పవర్‌ అడాప్టర్‌ సపోర్టు, హెచ్‌డీఎంఐ, హెడ్‌ఫోన్‌ జాక్‌ వంటివీ ఉన్నాయి. దీని బరువు 1.39 కిలోలు. పెవిలియన్‌ ప్లస్‌ 14తో పాటు వేగం, డిజైన్‌, సెక్యూరిటీ ఫీచర్లతో మెరుగు పరచిన హెచ్‌పీ 14, హెచ్‌పీ 15 సిరీస్‌ ల్యాప్‌టాప్‌లనూ హెచ్‌పీ పరిచయం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని