ఫోన్‌ స్టోరేజీ నిండుకుంటే?

ముచ్చటపడి ఫోన్‌ కొనుక్కున్నాం. బోలెడన్ని యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేశాం. సామాజిక మాధ్యమాల్లో జోరుగా షికారు చేస్తున్నాం. అంతా బాగానే ఉంది గానీ కొద్దినెలల్లోనే స్టోరేజీ నిండిపోతోంది

Published : 10 May 2023 00:20 IST

ముచ్చటపడి ఫోన్‌ కొనుక్కున్నాం. బోలెడన్ని యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేశాం. సామాజిక మాధ్యమాల్లో జోరుగా షికారు చేస్తున్నాం. అంతా బాగానే ఉంది గానీ కొద్దినెలల్లోనే స్టోరేజీ నిండిపోతోంది. ఎవరికైనా ఇలాంటి పరిస్థితి బాధ కలిగిస్తుంది. యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేయటానికి మనసొప్పదు. మరెలా? ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లో స్టోరేజీని ఖాళీ చేయటానికి తేలికైన మార్గాలు లేకపోలేదు.

గూగుల్‌ ఫైల్స్‌ యాప్‌

కొన్ని ఫోన్లలో ఇది అప్పటికే ఇన్‌స్టాల్‌ అయ్యుంటుంది. ఒకవేళ లేనట్టయితే గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి దిగుమతి చేసుకోవచ్చు. దీన్ని ఓపెన్‌ చేయగానే డుప్లికేట్‌ ఫొటోలు, జంక్‌ ఫైళ్లు, స్క్రీన్‌షాట్లు, పెద్ద ఫొటోల వంటి వాటిని తొలగించటానికి బోలెడన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. వీటి ద్వారా అనవసరమైన వాటిని తేలికగా డిలీట్‌ చేసుకోవచ్చు.

క్లౌడ్‌కు ఫొటోల బ్యాకప్‌

ఫొటోలు ఎక్కువగా తీసే అలవాటుంటే త్వరగా స్పేస్‌ నిండుకుంటుంది. ఎస్‌డీ కార్డుంటే కొంతవరకు ఉపయోగపడుతుంది. ఇది లేనివారికి గూగుల్‌ ఫొటోస్‌ మంచి సదుపాయం. ఇందులో 15జీబీ వరకు ఉచితంగా వాడుకోవచ్చు. దీన్ని స్పేస్‌ను ఖాళీ చేయటానికీ వాడుకోవచ్చు. ముందుగా గూగుల్‌ ఫొటోస్‌ను ఓపెన్‌ చేసి, పైన కుడివైపున ఉండే ప్రొఫైల్‌ పిక్చర్‌ మీద క్లిక్‌ చేయాలి. ఇందులో ‘ఫ్రీ అప్‌ స్పేస్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దీన్ని ట్యాప్‌ చేసి.. అప్పటికే గూగుల్‌ ఖాతా మీద బ్యాకప్‌ అయి ఉన్న ఫొటోలను ఫోన్‌ నుంచి డిలీట్‌ చేసుకోవచ్చు.

వాట్సప్‌ మీడియా శుభ్రం

వాట్సప్‌లో బోలెడన్ని గ్రూపులు. రోజూ ఎన్నో ఫైళ్లను షేర్‌ చేస్తుంటాం. ఫోన్‌ స్టోరేజీ నిండిపోవటానికి మరో కారణం- ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్ల వంటి వాటిని వాట్సప్‌ తనకుతానే డౌన్‌లోడ్‌ చేయటం. ఈ మీడియా ఫైళ్లను శుభ్రం చేయటానికి ముందుగా వాట్సప్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి. పైన కుడి మూలన కనిపించే మూడు చుక్కల మెనూ ద్వారా సెటింగ్స్‌లోకి వెళ్లాలి. ‘స్టోరేజ్‌ అండ్‌ డేటా’ను తాకి ‘మేనేజ్‌ స్టోరేజీ’లోకి వెళ్లాలి. దీనిలోంచి స్టోరేజీని ఆక్రమించిన ఫైళ్లను ఇట్టే తొలగించు
కోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు