డాక్స్‌ ఎమోజీలు

చిత్ర చిహ్నాలు ఎమోజీలకు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే గూగుల్‌ సంస్థ డాక్స్‌కూ వీటిని విస్తరించింది.

Published : 10 May 2023 00:20 IST

చిత్ర చిహ్నాలు ఎమోజీలకు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే గూగుల్‌ సంస్థ డాక్స్‌కూ వీటిని విస్తరించింది. దీంతో గూగుల్‌ డాక్స్‌లో కామెంట్స్‌ మీద ఎమోజీలతో ప్రతిస్పందనలను తెలియజేయొచ్చు. విండో కింద కుడివైపు మూలన కనిపించే బటన్‌ను ట్యాప్‌ చేసి, తగిన ఎమోజీని ఎంచుకుంటే సరి. డాక్స్‌ ద్వారా అవతలివారితో ప్రత్యక్షంగా చర్చిస్తున్నప్పుడూ వీటిని ఉపయోగించుకోవచ్చు. డాక్యుమెంట్‌లోని అంశాలపై త్వరగా, సృజనాత్మకంగా అభిప్రాయాలను వెలిబుచ్చటానికిది వీలు కల్పిస్తుంది. గూగుల్‌ షీట్స్‌కు యూట్యూబ్‌ స్మార్ట్‌ కాన్వాస్‌ చిప్‌ సదుపాయాన్నీ గూగుల్‌ జోడించనుంది. ఇది యూట్యూబ్‌ కంటెంట్‌ను మరింత తేలికగా నిర్వహించుకోవటానికి ఉపయోగపడుతుంది. దీంతో వీడియో శీర్షిక, వివరణ, వీడియో ప్రివ్యూ వంటి యూట్యూబ్‌ సమాచారాన్ని నేరుగా స్ప్రెడ్‌షీట్‌ గడికి జత చేసుకోవచ్చు. యూట్యూబ్‌ లింక్‌ను కాపీ చేసి, గడిలో పేస్ట్‌ చేస్తే చాలు. గూగుల్‌ స్లైడ్స్‌లో ఫొటోలను త్వరగా మార్చుకోవటానికి కొత్తగా డ్రాగ్‌ అండ్‌ డ్రాప్‌ ఫీచర్‌నూ ప్రవేశపెట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని