యూట్యూబ్‌లో గేమ్స్‌!

యూట్యూబ్‌ అంటే సినిమాలు, పాటలు, షార్ట్స్‌. అంతేనా? గేమ్స్‌ కూడా. అవును. ఇప్పటివరకూ వీడియోలను షేర్‌ చేసుకోవటానికి తోడ్పడుతున్న ఇది త్వరలో గేమ్స్‌ ఆడుకోవటానికీ వీలు కల్పించనుంది.

Published : 28 Jun 2023 00:07 IST
యూట్యూబ్‌ అంటే సినిమాలు, పాటలు, షార్ట్స్‌. అంతేనా? గేమ్స్‌ కూడా. అవును. ఇప్పటివరకూ వీడియోలను షేర్‌ చేసుకోవటానికి తోడ్పడుతున్న ఇది త్వరలో గేమ్స్‌ ఆడుకోవటానికీ వీలు కల్పించనుంది. ఆన్‌లైన్‌ గేమింగ్‌ వేదికగా యూట్యూబ్‌ విస్తరిస్తోంది మరి. ఇందుకోసం అంతర్గతంగా ‘ప్లేయెబుల్స్‌’ అనే కొత్త సాధనాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని పరీక్షించటానికి ఉద్యోగులనూ పురమాయించింది. దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ ఆన్‌లైన్‌ గేమింగ్‌ రంగంలోకి విస్తరించటం మీద యూట్యూబ్‌ చాలా ఆసక్తి కనబరుస్తోంది. కొత్త ఫీచర్లతో ప్రయోగాలూ మొదలుపెట్టింది. బహుళ ప్రజాదరణ పొందిన స్టాక్‌ బౌన్స్‌ అనే ఆటను పరీక్ష కోసం అందుబాటులో ఉంచింది. ప్లేయెబుల్స్‌ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ పరికరాల్లోనే కాదు.. వెబ్‌ బ్రౌజర్‌లో యూట్యూబ్‌ వెబ్‌సైట్‌ మీదా నేరుగా గేమ్స్‌ ఆడుకోవచ్చు. వేర్వేరు వేదికలకు మారిపోకుండా యూట్యూబ్‌లోనే గేమ్స్‌ ఆడేలా చేయటం, వినియోగదారులను ఆకట్టుకొని వారి సంఖ్య పెంచుకోవటం దీని ఉద్దేశం. గేమింగ్‌ ప్రియులకు ఇంతకన్నా ఇంకేం కావాలి?
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు