టెలిగ్రామ్‌లో స్టోరీస్
ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, స్నాప్‌ఛాట్ తరహాలో టెలిగ్రామ్ సైతం ఇటీవల ‘స్టోరీస్’ ఫీచర్‌ను తీసుకొచ్చింది. అయితే ఇది ప్రీమియం చందాదారులకే అందుబాటులో ఉంటుంది.
ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, స్నాప్‌ఛాట్ తరహాలో టెలిగ్రామ్ సైతం ఇటీవల ‘స్టోరీస్’ ఫీచర్‌ను తీసుకొచ్చింది. అయితే ఇది ప్రీమియం చందాదారులకే అందుబాటులో ఉంటుంది. ఎప్పటి మాదిరిగానే టెలిగ్రామ్ దీనిలోనూ ప్రత్యేకతను ప్రదర్శించింది. మిగతా యాప్‌ల్లో 24 గంటల తర్వాత స్టోరీస్ డిలీట్ అయ్యే సదుపాయముంటే ఇందులో 6, 12, 24, 48 గంటల తర్వాత.. ఇలా ఇష్టమున్నట్టుగా డిలీట్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని వాడుకోవాలంటే టెలిగ్రామ్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి అప్‌డేట్ చేసుకోగానే ఛాట్ జాబితాలో పైన ‘స్టోరీస్’ విభాగం కనిపిస్తుంది. దీనిలోని ప్లస్ గుర్తు మీద ట్యాప్ చేసి కొత్త స్టోరీని సృష్టించుకోవచ్చు. ఫోన్‌లోని ఫొటోలు, వీడియోలు దీనికి జత చేసుకోవచ్చు. లేదూ కొత్త ఫొటోలైనా తీసుకోవచ్చు. వీటిని జత చేసుకున్నాక ‘పోస్ట్’ బటన్ నొక్కితే ఎంచుకున్న కాంటాక్టులకు షేర్ అవుతాయి. ఇందులో వీడియో సందేశాల ఫీచర్ కూడా ఉండటం విశేషం. ముందు, వెనక రెండు కెమెరాలతోనూ స్టోరీలను రికార్డు చేయొచ్చు. ఈ స్టోరీలకు ఇతర యూజర్లనూ ట్యాగ్ చేయొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
PM Modi: 72అడుగుల ఎత్తైన దీన్‌దయాళ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
-
Delimitation: దక్షిణాది వాణిని అణచివేయాలని చూస్తే మౌనం వహించేది లేదు: కేటీఆర్
-
IND vs AUS: భారత్‌ను ఓడించిన జట్టు ప్రపంచకప్ గెలుస్తుంది: మైఖేల్ వాన్
-
Vasu Varma: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది నేను కాదు: ‘జోష్’ దర్శకుడు
-
RBI: ఆర్బీఐ కొరడా.. ఎస్బీఐ సహా 3 బ్యాంకులకు పెనాల్టీ
-
నెట్టింట్లో బాలికల నకిలీ నగ్న చిత్రాలు.. AI చిత్రాలపై స్పెయిన్ దిగ్భ్రాంతి