ఇక ఎక్స్‌లో ప్రత్యక్ష వీడియో

ట్విటర్‌ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచీ ఇలాన్‌ మస్క్‌ తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. ఇటీవలే ట్విటర్‌ పేరును ఎక్స్‌గా మార్చిన ఆయన తాజాగా బ్లూటిక్‌ హైడ్‌, లైవ్‌ వీడియో ఫీచర్లను జోడించారు.

Published : 09 Aug 2023 00:01 IST

ట్విటర్‌ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచీ ఇలాన్‌ మస్క్‌ తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. ఇటీవలే ట్విటర్‌ పేరును ఎక్స్‌గా మార్చిన ఆయన తాజాగా బ్లూటిక్‌ హైడ్‌, లైవ్‌ వీడియో ఫీచర్లను జోడించారు. వీటిని ప్రత్యక్ష వీడియో ప్రసారంతోనే ప్రకటించటం గమనార్హం. ‘‘ఇప్పుడు లైవ్‌ వీడియో బాగా పనిచేస్తోంది. పోస్ట్‌ చేసేటప్పుడు కెమెరా వంటి బటన్‌ను తాకితే చాలు’’ అని పోస్ట్‌ ద్వారా తన అభిమానులకు తెలియజేశారు. విచిత్రమైన వీడియోతో సహోద్యోగులకు వినోదం కలిగిస్తూ మస్క్‌ ఈ ఫీచర్‌ను పరీక్షించారు. మొత్తం 50 సెకండ్ల నిడివి గల వీడియోలో తన రూపాన్ని చెక్‌ చేసుకున్నారు. తర్వాత తనతో చర్చిస్తున్న సహోద్యోగుల మీద కెమెరాను ఫోకస్‌ చేశారు. నిజానికిది లైవ్‌ వీడియో ఫీచర్‌ పరీక్ష కోసం ఉద్దేశించిందని ఎక్స్‌ ఆ తర్వాత పేర్కొంది. తాను ప్రత్యక్షంగా కనిపిస్తున్నానా? ఈ ఫీచర్‌ సరిగ్గా పనిచేస్తోందా? అని మస్క్‌ వీక్షకులను ప్రశ్నించారు. సరిగా పనిచేస్తున్నట్టు ధ్రువీకరించుకున్నాక సమావేశ టేబుల్‌ చుట్టూ కూర్చున్నవారిని చూపించారు. అంతేకాదు, డంబెల్‌ తీసుకొని ఆఫీసులో అందరి ముందూ కాసేపు కసరత్తూ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని