యూట్యూబ్‌లో యాడ్‌ బ్లాకర్లకు చెల్లు

యూట్యూబ్‌లో మంచి పాటలు వింటుంటాం. పంటి కింద రాయిలా హఠాత్తుగా వాణిజ్య ప్రకటనలు ప్రత్యక్షమవుతాయి. హుషారంతా ఆవిరవుతుంది.

Updated : 23 Aug 2023 01:57 IST

యూట్యూబ్‌లో మంచి పాటలు వింటుంటాం. పంటి కింద రాయిలా హఠాత్తుగా వాణిజ్య ప్రకటనలు ప్రత్యక్షమవుతాయి. హుషారంతా ఆవిరవుతుంది. అందుకే ప్రకటనల బెడదను తప్పించుకోవటానికి చాలామంది యాడ్‌ బ్లాకర్లను నిక్షిప్తం చేసుకుంటారు. ఇకపై ఇలాంటి ఆటలు చెల్లవు. ప్రకటనలను అడ్డుకునే ఎక్స్‌టెన్షన్లు ఉంటే వీడియోలు అసలే ప్లే కావు. ఇప్పటికే యూట్యూబ్‌ దీనిపై చిన్నపాటి ప్రయోగం ఆరంభించింది. యాడ్‌ బాక్లర్లు వాడే కొందరికి ప్రస్తుతం యాడ్‌ బ్లాకర్‌ను టర్న్‌ ఆఫ్‌ చేయండి లేదా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోండి అంటూ సందేశం పంపుతోంది. అయితే యాడ్‌ బ్లాకర్‌తో మూడు వీడియోల వరకు చూసే అనుమతి ఇస్తోంది. అప్పటికీ యాడ్‌ బ్లాకర్‌ను టర్న్‌ ఆఫ్‌ చేయకపోతే వీడియో ప్లే కావటం ఆగిపోతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని