డెస్క్‌టాప్‌ మీద రెండు వాట్సప్‌లు!

వాట్సప్‌లో లింక్డ్‌ డివైసెస్‌ ఫీచర్‌ గురించి తెలిసిందే. ఒకే వాట్సప్‌ ఖాతాకు నాలుగు పరికరాలను కనెక్ట్‌ చేసుకోవటానికిది తోడ్పడుతుంది. ప్రధాన పరికరం యాక్టివ్‌గా లేకపోయినా ఆయా పరికరాలకు మెసేజ్‌లు, కాల్స్‌ వేర్వేరుగానూ అందుతాయి.

Updated : 13 Sep 2023 01:18 IST

వాట్సప్‌లో లింక్డ్‌ డివైసెస్‌ ఫీచర్‌ గురించి తెలిసిందే. ఒకే వాట్సప్‌ ఖాతాకు నాలుగు పరికరాలను కనెక్ట్‌ చేసుకోవటానికిది తోడ్పడుతుంది. ప్రధాన పరికరం యాక్టివ్‌గా లేకపోయినా ఆయా పరికరాలకు మెసేజ్‌లు, కాల్స్‌ వేర్వేరుగానూ అందుతాయి. ఆండ్రాయిడ్‌ యూజర్లకైతే డ్యుయెల్‌ యాప్‌ ఫీచర్‌ కూడా ఉంది. దీంతో వాట్సప్‌ యాప్‌ను క్లోన్‌ చేసుకోవచ్చు. వేర్వేరు ఖాతాలతో వాడుకోవచ్చు. ఐఫోన్‌ వాడేవారైతే వాట్సప్‌ బిజినెస్‌, మామూలు వాట్సప్‌లను విడివిడిగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఒకే సమయంలో ఈ రెండింటినీ వాడుకోవచ్చు. కానీ డెస్క్‌టాప్‌ దగ్గరికి వచ్చేసరికి పరిస్థితి మారిపోతుంది. అధికారికంగా విండోస్‌ కోసం బిల్టిన్‌ క్లోన్‌ యాప్‌ ఫీచర్లు, వేర్వేరు వర్షన్లు ఏవీ లేవు. అయితేనేం? డెస్క్‌టాప్‌ మీద రెండు వాట్సప్‌ ఖాతాలను వాడుకోవటానికి మార్గాలు లేకపోలేదు. ముందు మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ లేదా వాట్సప్‌ అధికార వెబ్‌సైట్‌ నుంచి వాట్సప్‌ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం రెండో పద్ధతిని ఉపయోగించాలి. వెబ్‌ బ్రౌజర్‌ను ఓపెన్‌ చేసి web.whatsapp.com లోకి వెళ్లాలి. దీనికి లింక్డ్‌ డివైస్‌ ఫీచర్‌ ద్వారా కనెక్ట్‌ కావాలి. ఇలా ఒకే సమయంలో రెండు వాట్సప్‌ ఖాతాలను వాడుకోవచ్చు.

గ్రూప్‌ ఛాట్స్‌ వడపోత కోసం

ఇటీవల ఛాట్‌ లాకింగ్‌, ఛాట్‌ ట్రాన్స్‌ఫర్స్‌ వంటి ఫీచర్లను పరిచయం చేసిన వాట్సప్‌ తాజాగా గ్రూప్‌ ఛాట్స్‌ను వడపోసే కొత్త ఫీచర్‌ను తెస్తోంది. ఉత్తర ప్రత్యుత్తరాల మీద మరింత నియంత్రణ కోసం ఇది తోడ్పడుతుంది. మెసేజ్‌ల ప్రాధాన్యాన్ని నిర్ణయించటం తేలికవుతుంది. అయితే ఈ ఫీచర్‌ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. గూగుల్‌ ప్లే బీటా ప్రోగ్రామ్‌ ద్వారా వాట్సప్‌ కొత్త వర్షన్‌తో ఇది అందుబాటులో ఉంటుంది. కొత్త ఫిల్టర్‌ సదుపాయంతో వ్యక్తిగత సంభాషణలను పక్కకు పెడుతూ గ్రూప్‌ ఛాట్స్‌ జాబితాను సృష్టించుకోవచ్చు. అంటే పర్సనల్‌ ఫిల్టర్‌ను కాంటాక్ట్స్‌ ఫిల్టర్‌గా మార్చారని చెప్పుకోవచ్చు. ప్రత్యేకమైన గ్రూప్స్‌, అన్‌రీడ్‌ ట్యాబ్‌ ఫిల్టర్‌ కూడా ఉండటం విశేషం. ఈమెయిల్‌ ధ్రువీకరణ, కాల్స్‌ చేసేటప్పుడు ఐపీ చిరునామా కనిపించకుండా చేయటం వంటి ఫీచర్ల మీదా వాట్సప్‌ కృషి చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని