స్వేచ్ఛా జీపీటీ!

కృత్రిమ మేధ (ఏఐ) శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దీని ఆధారంగా ఎన్నో ఛాట్‌బాట్స్‌ పుట్టుకొస్తున్నాయి. వీటితో చిక్కేంటంటే ఇంటర్నెట్‌, డేటా విధానాల మీద ఆధారపడటం.

Published : 04 Oct 2023 00:12 IST

కృత్రిమ మేధ (ఏఐ) శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దీని ఆధారంగా ఎన్నో ఛాట్‌బాట్స్‌ పుట్టుకొస్తున్నాయి. వీటితో చిక్కేంటంటే ఇంటర్నెట్‌, డేటా విధానాల మీద ఆధారపడటం. ఈ సమస్యను పరిష్కరించటానికి ఏజ్‌ ఆఫ్‌ ఏఐ, ఎల్‌ఎల్‌సీ సంస్థలు వినూత్న జీపీటీని రూపొందించాయి. దీని పేరు ఫ్రీడమ్‌ జీపీటీ. ఇది పూర్తిగా సెన్సార్‌ రహితం, వ్యక్తిగతం. ఈ సాఫ్ట్‌వేర్‌తో ఎక్కడికక్కడే కంప్యూటర్ల మీద జనరేటివ్‌ ఏఐ ఇంజిన్లను నడిపించొచ్చు. అదీ ఆఫ్‌లైన్‌లో. గోప్యతకు ఎలాంటి భంగం కలగదు. అందుకే ఇది వ్యక్తుల స్వేచ్ఛకు ఊతమిస్తుందని భావిస్తున్నారు. ఫ్రీడమ్‌జీపీటీని వాడుకోవాలంటే.. freedomgot.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. పీసీని బట్టి ఇంటర్నెట్‌, విండోస్‌, లేదా మ్యాక్‌ వర్షన్లలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. సాఫ్ట్‌వేర్‌ను సెట్‌ చేసి.. ఎల్‌ఎల్‌ఏఎం, ఆల్పాస ఛాట్‌బాట్లలో ఏదో ఒకదాన్ని ఇన్‌స్టాల్‌ చేసుకుంటే చాలు. ఇంటర్నెట్‌ లేకుండానే పరికరం మీదే ఛాటింగ్‌ చేసేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని