టెక్‌ చిట్కాలు

ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు ఇకపై బయోలో ఐదు లింకుల వరకు యాడ్‌ చేసుకోవచ్చు. యాప్‌లో లాగిన్‌ అయ్యాక అకౌంట్‌ సెటింగ్స్‌ను ఓపెన్‌ చేయాలి. మన ఫొటో దిగువన ఉండే ఎడిట్‌ ప్రొఫైల్‌లోకి వెళ్లి యాడ్‌ లింకును క్లిక్‌ చేయాలి. షేర్‌ చేయాలనుకునే లింకు జత చేసుకుంటే సరి.

Updated : 14 Feb 2024 04:31 IST

ఇన్‌స్టాల్‌లో మరిన్ని లింకులు

న్‌స్టాగ్రామ్‌ యూజర్లు ఇకపై బయోలో ఐదు లింకుల వరకు యాడ్‌ చేసుకోవచ్చు. యాప్‌లో లాగిన్‌ అయ్యాక అకౌంట్‌ సెటింగ్స్‌ను ఓపెన్‌ చేయాలి. మన ఫొటో దిగువన ఉండే ఎడిట్‌ ప్రొఫైల్‌లోకి వెళ్లి యాడ్‌ లింకును క్లిక్‌ చేయాలి. షేర్‌ చేయాలనుకునే లింకు జత చేసుకుంటే సరి.


కస్టమర్‌ మెయిల్‌ మరొకరికి

చిన్న వ్యాపారాలు చేసేవారు తమ కస్టమర్‌ ఈమెయిల్‌ అకౌంట్‌ను మరికొందరు వాడుకోవటానికి అందుబాటులో ఉంటే బాగుంటుందని అనుకుంటుంటారు. ఇందుకు జీమెయిల్‌లో ఉన్న సదుపాయం సాయం తీసుకోవచ్చు. కంప్యూటర్‌ మీద జీమెయిల్‌ను ఓపెన్‌ చేసి లాగిన్‌ కావాలి. పైన కుడివైపున కనిపించే చక్రం గుర్తు మీద క్లిక్‌ చేసి సెటింగ్స్‌లోకి వెళ్లాలి. పై జాబితాలో అకౌంట్స్‌ అండ్‌ ఇంపోర్టు మీద క్లిక్‌ చేయాలి. గ్రాంట్‌ యాక్సెస్‌ టు యువర్‌ అకౌంట్‌ విభాగంలో యాడ్‌ అనదర్‌ అకౌంట్‌ మీద నొక్కాలి. అడ్రస్‌ బాక్సులో ఈమెయిల్‌ ఐడీని ఎంటర్‌ చేసి.. నెక్స్ట్‌ స్టెప్‌ మీద క్లిక్‌ చేస్తే చాలు. దీంతో యాడ్‌ చేసిన వ్యక్తులు ఆ ఖాతాలోకి లాగిన్‌ అయ్యి మెయిళ్లను చదవటానికి, డిలీట్‌ చేయటానికి, మెయిళ్లు పంపటానికి అనుమతి లభిస్తుంది.


కిండిల్‌లోనూ వర్డ్‌ డాక్యుమెంట్‌

కిండిల్‌ స్క్రైబ్‌లో వర్డ్‌ డాక్యుమెంట్‌ను ఓపెన్‌ చేయాలనుకుంటున్నారా? అయితే మైక్రోసాఫ్ట్‌ 365 వర్డ్‌ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. దీన్ని ఓపెన్‌ చేసి ఫైల్‌ను ఎంచుకొని, తర్వాత ఎక్స్‌పోర్ట్‌ మీద క్లిక్‌ చేసి సెండ్‌ టు కిండిల్‌ను ఎంచుకోవాలి. అప్పుడది కిండిల్‌కు చేరుకుంటుంది. పాత కిండిల్‌ను వాడేవారికిది ఎంతో అనువుగా ఉంటుంది.  


ఫోనే భూతద్దం

చీకటిగా ఉండే హోటళ్ల వంటి చోట్ల మెనూలో చిన్న అక్షరాలను చదవటానికి ఇబ్బంది పడుతున్నారా? ఫోన్‌ సాయం తీసుకుంటే సరి. ఐఫోన్‌ వాడేవారు యాపిల్‌ యాప్‌ స్టోర్‌ను ఓపెన్‌ చేసి మాగ్నిఫయర్‌ కోసం సెర్చ్‌ చేయాలి. ఇది ఫోన్‌లో బిల్టిన్‌గానే ఉంటుంది. స్లైడర్‌ సాయంతో జూమ్‌ చేసి చిన్న అక్షరాలను చదవొచ్చు. మసక వెలుతురున్నట్టయితే ఫ్లాష్‌లైట్‌ గుర్తు మీద తాకొచ్చు. మరి ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వాడుతుంటే? సెటింగ్స్‌ను ఓపెన్‌ చేసి యాక్సెసబిలిటీ మీద ట్యాప్‌ చేసి మాగ్నిఫికేషన్‌ను ఎంచుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని