వాట్సప్‌లో ఫేవరెట్స్‌ ట్యాబ్‌

వాట్సప్‌ ఛాట్స్‌ జాబితాలో ఇష్టమైన కాంటాక్టులను కనుక్కోవటం కష్టంగా ఉందా? త్వరలోనే దీనికి పరిష్కారం లభించనుంది. కొత్తగా ఫేవరెట్స్‌ ట్యాబ్‌ను పరిచయం కానుంది. దీన్ని ప్రస్తుతం ఐఓఎస్‌, వెబ్‌ యూజర్ల కోసం పరీక్షిస్తున్నారు.

Published : 21 Feb 2024 00:27 IST

వాట్సప్‌ ఛాట్స్‌ జాబితాలో ఇష్టమైన కాంటాక్టులను కనుక్కోవటం కష్టంగా ఉందా? త్వరలోనే దీనికి పరిష్కారం లభించనుంది. కొత్తగా ఫేవరెట్స్‌ ట్యాబ్‌ను పరిచయం కానుంది. దీన్ని ప్రస్తుతం ఐఓఎస్‌, వెబ్‌ యూజర్ల కోసం పరీక్షిస్తున్నారు. ఇది ఆయా కాంటాక్టులను తేలికగా, త్వరగా గుర్తించటానికి ఉపయోగపడుతుంది. వాట్సప్‌ వెబ్‌ యూఐ త్వరలోనే అప్‌డేట్‌ కానుంది. దీంతో ఆల్‌, అన్‌రీడ్‌, ఫేవరెట్స్‌, లేబుల్స్‌ విభాగాలన్నీ వేర్వేరుగా కనిపిస్తాయి. ఇష్టమైన కాంటాక్టులన్నింటినీ ఫేవరెట్‌ జాబితాలో చేర్చుకోవచ్చు. అయితే ఈ ట్యాబ్‌లో ఎన్ని కాంటాక్టులను జోడించు కోవచ్చనేది ఇంకా తెలియరాలేదు. దీన్ని స్మార్ట్‌ఫోన్లలో ఎలా అమలు చేస్తారన్నదీ స్పష్టం కాలేదు. ఎందుకంటే అన్ని ట్యాబ్‌లను చూపించటానికి పెద్ద తెర కావాల్సి ఉంటుంది.

  • వాట్సప్‌ త్వరలో ప్రొఫైల్‌ ఫొటోలను స్క్రీన్‌షాట్‌ తీయకుండా తోడ్పడే ఫీచర్‌నూ ప్రవేశపెట్టనుంది. దీన్ని ఆండ్రాయిడ్‌ బీటీ టెస్టర్లకు ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆసక్తిగల యూజర్లు 2.24.4.25 అప్‌డేట్‌ వర్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొని ఈ ఫీచర్‌ను పరీక్షించొచ్చు. ప్రొఫైల్‌ ఫొటోను స్క్రీన్‌షాట్‌ తీస్తున్నప్పుడు బ్లాక్‌ చేసినట్టు నోటిఫికేషన్‌ అందుతుంది. అనధికారికంగా ప్రొఫైల్‌ ఫొటోలను షేర్‌ చేయకుండా ఇది అడ్డుకుంటుంది.
  • భద్రతను మెరుగు పరచటానికీ వాట్సప్‌ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇటీవల ఫిషింగ్‌ దాడులను అరికట్టటానికి లాక్‌ స్క్రీన్‌ నుంచే తెలియని నంబర్లను బ్లాక్‌ చేసే సదుపాయాన్ని తీసుకొచ్చింది. కాల్‌ చేస్తున్నప్పుడు ఐపీ చిరునామాను దాచెయ్యటం, కొంతకాలం తర్వాత మెసేజ్‌లు అదృశ్యం కావటం, అజ్ఞాత నంబర్ల ఆటో-కాల్‌ సైలెన్స్‌ ఫీచర్లూ వచ్చాయి. కంపెనీలు, సెలబ్రిటీల నుంచి నేరుగా వాట్సప్‌లోనే అప్‌డేట్స్‌ అందించే ఛానెల్స్‌ సదుపాయాన్నీ కల్పించింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని