యూట్యూబర్‌కు నేరుగా మెయిల్‌!

ఇష్టమైన యూట్యూబర్‌. అంశం నచ్చితే కామెంట్‌ చేస్తాం. అయితే కొన్నిసార్లు ఇతరులకు తెలియకుండా వ్యక్తిగత సందేశాన్ని పంపించాలని అనిపించొచ్చు.

Updated : 22 Mar 2023 03:18 IST

ఇష్టమైన యూట్యూబర్‌. అంశం నచ్చితే కామెంట్‌ చేస్తాం. అయితే కొన్నిసార్లు ఇతరులకు తెలియకుండా వ్యక్తిగత సందేశాన్ని పంపించాలని అనిపించొచ్చు. నిజానికి యూట్యూబ్‌లో నేరుగా ఇతరులకు సందేశాన్ని పంపించుకోవటం సాధ్యం కాదు. కానీ నేరుగా ఈమెయిల్‌ పంపించుకోవచ్చు. సోషల్‌ మీడియా ప్రొఫైల్‌ లేదా పబ్లిక్‌ ఛాట్‌ ద్వారా యూట్యూబ్‌ క్రియేటర్లకు, ఛానెల్‌ అడ్మిన్లకు సమాచారాన్ని చేరవేయొచ్చు.

* ఈమెయల్‌ ద్వారా సందేశాన్ని పంపించాలనుకుంటే ముందుగా యూట్యూబ్‌ ఖాతాకు లాగిన్‌ కావాలి.

* సెర్చ్‌ బార్‌లో ఛానెల్‌ లేదా వ్యక్తి పేరును టైప్‌ చేయాలి. వీడియో కింద కనిపించే యూజర్‌ నేమ్‌ లేదా బ్యానర్‌ మీద క్లిక్‌ చేసి కూడా ఛానెల్‌ క్రియేటర్‌ వివరాలతో కూడిన పేజీని చూడొచ్చు.

* ఛానెల్‌లోకి వెళ్లాక ‘అబౌట్‌’ మీద క్లిక్‌ చేయాలి. కిందికి స్క్రోల్‌ చేస్తే వ్యూ మెయిల్‌ అడ్రస్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. క్రియేటర్లు తమ ఈమెయిల్‌ అడ్రస్‌ను లింక్‌ చేస్తేనే అది కనిపిస్తుందని తెలుసుకోవాలి.

* ఒకవేళ ఈమెయిల్‌ చిరునామాను లింక్‌ చేసినట్టయితే ‘ఐయామ్‌ నాట్‌ ఎ రోబో’ బాక్స్‌లో టిక్‌ చేయాలి. రీక్యాప్చియాను ఎంటర్‌ చేసి, సబ్‌మిట్‌ చేస్తే ఈమెయిల్‌ చిరునామా కనిపిస్తుంది. దీనిపై క్లిక్‌ చేసి మెయిల్‌ పంపొచ్చు. కాపీ చేసి ఈమెయిల్‌ క్లయింట్‌లో పేస్ట్‌ చేసి నేరుగా సందేశాన్ని పంపించొచ్చు.

* అబౌట్‌ పేజీలోనే ట్విటర్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా ప్రొఫైళ్లు కూడా ఉండొచ్చు. ఈ లింకుల మీద క్లిక్‌ చేస్తే వారి ప్రొఫైల్‌ పేజీ తెరచుకుంటుంది. వీటి ద్వారానూ సందేశాన్ని పంపొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని