WhatsApp: వాట్సాప్‌లో భారీగా లిమిట్‌ పెంపు.. ఒకేసారి 30 నుంచి 100కి!

మెసేజింగ్ యాప్‌ వాట్సాప్ (WhatsApp) మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ (Android) యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే ఐఓఎస్‌ (iOS) యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని వాట్సాప్ తెలిపింది.

Updated : 07 Feb 2023 17:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూజర్లకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వాట్సాప్‌ (WhatsApp) ఎప్పటికప్పుడు యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్లను  పరిచయం చేస్తోంది. కేవలం మెసేజింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా.. గ్రూప్‌ కాలింగ్‌ (Group Calling), పేమెంట్స్‌ (Payments), ఫొటో ఎడిట్‌ (Photo Edit) వంటి ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు ఒకేసారి 100 మీడియా ఫైల్స్‌ ( Media Files)ను షేర్‌ చేయొచ్చు. ప్రస్తుతం వాట్సాప్‌లో 30కి మించి మీడియా ఫైల్స్‌ను షేర్‌ చేయలేం. తాజా అప్‌డేట్‌లో ఈ పరిమితిని 100కి పెంచుతున్నట్లు వాట్సాప్‌ తెలిపింది. 

ప్రస్తుతం ఈ ఫీచర్‌ అప్‌డేట్‌ ఆండ్రాయిడ్ (Android) యూజర్లకు అందుబాటులో ఉంది. ఒకవేళ ఈ ఫీచర్‌ ఇప్పటికీ రాకుంటే యూజర్లు తమ ఫోన్లలో వాట్సాప్‌ ఆండ్రాయిడ్ 2.23.4.3 వెర్షన్‌ అప్‌డేట్‌ చేసుకోవాలి. త్వరలో ఐఓఎస్‌ (iOS) యూజర్లకు సైతం అందుబాటులోకి తీసుకొస్తామని వాట్సాప్ తెలిపింది. వాట్సాప్‌ చాట్‌లో భాగంగా తరచూ ఫొటోలు షేర్ చేసేవారికి ఈ ఫీచర్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇటీవలే వాట్సాప్ వీడియో మోడ్‌ (Video Mode)ను పరిచయం చేసింది. దీంతో యూజర్లు వీడియో రికార్డింగ్‌ కోసం గతంలో మాదిరి కెమెరా బటన్‌ను నొక్కి పెట్టాల్సిన అవసరంలేదు. రికార్డింగ్‌ బటన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. దీంతోపాటు ఒరిజినల్‌ క్వాలిటీలో ఫొటోలను షేర్‌ చేసుకునేలా వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్‌ అందుబాటులోకి రానుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని