WhatsApp: మూడు ఆప్షన్లతో వాట్సాప్ టెక్స్ట్‌ ఎడిటర్ ఫీచర్‌!

వాట్సాప్ టెక్స్ట్‌ ఎడిటర్‌ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది. ఇందులో మూడు ఆప్షన్లు ఉంటాయి. వాటితో యూజర్‌ టెక్స్ట్‌లో తనకు నచ్చిన విధంగా మార్పులు చేయొచ్చు. 

Published : 27 Jan 2023 22:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూజర్లకు మెరుగైన సేవలను అందించేందుకు మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ (WhstApp) ఎప్పటికప్పుడు అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను పరిచయం చేస్తుంటుంది. ఇప్పటికే వాయిస్‌ నోట్‌, తేదీతో చాట్ సెర్చ్‌, పిక్చర్‌-ఇన్‌-పిక్చర్‌ మోడ్‌ వంటి ఫీచర్లను పరిచయం చేసింది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం వాట్సాప్‌లో ఉన్న డ్రాయింగ్‌ టూల్‌ (Drawing Tool)లో టెక్స్ట్‌ ఎడిటర్‌ (Text Editor) పేరుతో ఈ ఫీచర్‌ను పరిచయం చేయనుంది. టెక్స్ట్‌ ఎడిటర్‌లో మూడు ఆప్షన్లు ఉంటాయి. వీటితో యూజర్లు టెక్స్ట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ (Text Background), ఫాంట్ ఛేంజ్‌ (Font Change), టెక్స్ట్‌ అలైన్‌మెంట్‌  (Text Alignment) వంటివి చేయొచ్చు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే సాధారణ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్‌బీటా ఇన్ఫో (WABetaInfo) తెలిపింది.

వాట్సాప్‌ టెక్స్ట్‌ ఎడిటర్‌లోని ఫాంట్‌ ఛేంజ్‌ ఆప్షన్‌తో యూజర్‌ కీబోర్డులో తనకు నచ్చిన ఫాంట్‌ను ఎంచుకుని టెక్స్ట్‌లో మార్పులు చేయొచ్చు. ఫొటో, వీడియో, గిఫ్‌లపై టెక్స్ట్‌ రాసేప్పుడు ఈ ఫీచర్‌ యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. టెక్స్ట్‌ అలైన్‌మెంట్‌ ఫీచర్‌తో యూజర్‌ తనకు నచ్చిన వైపు దాన్ని మార్చుకోవచ్చు. టెక్ట్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌తో మొత్తం టెక్స్ట్‌ ముఖ్యమైన భాగాన్ని ప్రత్యేకంగా కనిపించేలా మార్పులు చేయొచ్చు. అలానే నచ్చిన రంగు లేదా ఫొటోను టెక్స్ట్‌ బ్యాక్‌గ్రౌండ్‌గా పెట్టుకోవచ్చు. వీటితోపాటు యూజర్లు వాట్సాప్‌లో పంపే ఫొటోలను ఒరిజినల్‌ సైజ్‌లో పంపేలా కొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. దీంతో యూజర్ వాట్సాప్‌ ద్వారా ఫొటోను ఇతరులతో షేర్‌ చేసినప్పుడు వాటి క్వాలిటీలో ఎలాంటి మార్పు జరగదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని