WhatsApp: వాట్సాప్‌లో కొత్త మోసం.. అప్రమత్తంగా లేకుంటే షాకిస్తారు!

ప్రతి నెలా ఆన్‌లైన్‌లో కరెంటు బిల్లు చెల్లిస్తున్నారా?  నెలా మీరు తరచుగా బిల్లు చెల్లించే యాప్‌ నుంచి కాకుండా కరెంటు బిల్లు బాకీ ఉందని వాట్సాప్‌లో మెసేజ్‌ వచ్చిందా? అయితే మీరు అప్రమత్తంగా ఉండాలి.

Published : 10 Oct 2022 21:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతి నెలా ఆన్‌లైన్‌లో కరెంటు బిల్లు చెల్లిస్తున్నారా?  నెలా మీరు తరచుగా బిల్లు చెల్లించే యాప్‌ నుంచి కాకుండా కరెంటు బిల్లు బాకీ ఉందని వాట్సాప్‌లో మెసేజ్‌ వచ్చిందా? అయితే మీరు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే సైబర్‌ నేరగాళ్లు మీకు షాకిస్తారు. అవును.. యూజర్ల అవగాహన లోపమే పెట్టుబడిగా వాట్సాప్‌ వేదికగా సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి తెరలేపారు. సాధారణంగా యూజర్లు కరెంట్‌ బిల్లు గడువు తేదీలోగా చెల్లించాలని కోరుతూ యూజర్లకు కొన్ని విద్యుత్‌ సంస్థలు వాట్సాప్ ద్వారా అలర్ట్ మెసేజ్‌లు పంపుతాయి. అయితే బిల్లు చెల్లింపునకు సంబంధించి ఎలాంటి లింక్‌ను షేర్‌ చేయదు. ఈ సమాచారం తెలుసుకున్న సైబర్‌ నేరగాళ్లు యూజర్లు కరెంట్‌ బిల్లు చెల్లించాలని కోరుతూ నకిలీ మెసేజ్‌లను పంపుతున్నారు.

యూజర్లు మెసేజ్‌లో ఉన్న నంబర్‌కు ఫోన్‌ చేస్తే ‘బిల్లు బాకీ ఉంది, వెంటనే చెల్లించకుంటే కరెంట్‌ సరఫరా నిలిచిపోతుంది’ అని హెచ్చరిస్తున్నట్లు పలువురు ట్వీట్‌ చేశారు. గుజరాత్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, ఒడిశా రాష్ట్రాల్లోని యూజర్లకు ఎక్కువగా ఈ తరహా మెసేజ్‌లను వస్తున్నట్లు తెలుస్తోంది. గత నెల బిల్లు చెల్లించడం మర్చిపోయిన వినియోగదారులే లక్ష్యంగా సైబర్‌ నేరగాళ్లు ఈ మోసానికి పాల్పపడుతున్నట్లు సమాచారం. యూజర్లు ఇలాంటి మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఫోన్‌లో అవతలి వ్యక్తులకు పిన్‌, బ్యాంక్‌ ఖాతా వివరాలతోపాటు, ఇతర నగదు చెల్లింపులకు సంబంధించిన వివరాలు వెల్లడించవద్దని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు.

ఒకవేళ మీరు మెసేజ్‌లోని నంబర్‌కు కాల్ చేస్తే అవతలి వ్యక్తి ఉపయోగించే భాష ఎలా ఉంది?, స్పష్టంగా మాట్లాడగలుగుతున్నాడా? లేదా?, బిల్లు చెల్లించమని మాత్రమే సూచిస్తున్నాడా? లేక నగదు చెల్లింపునకు సంబంధించిన వివరాలు (ఏటీఎం కార్డ్‌ నంబర్‌, యూపీఐ పిన్‌, బ్యాంకు ఖాతా నంబర్‌) అడుగుతుంటే అవతలివ్యక్తిని సందేహించాల్సిందే. వారితో అప్రమత్తంగా వ్యవహిరించమని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని