WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
వాట్సాప్‌లో వీడియో రికార్డింగ్‌ను సులభతరం చేస్తూ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. మరోవైపు రేపటి నుంచి పాత వెర్షన్ ఓఎస్‌తో పనిచేస్తున్న ఫోన్లకు వాట్సాప్ తన సేవలను నిలిపివేయనుంది.
ఇంటర్నెట్ డెస్క్: మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో యూజర్లు వాట్సాప్‌లో సులువుగా వీడియో రికార్డు చేయొచ్చు. గతంలో వాట్సాప్‌లో వీడియో రికార్డు చేసేందుకు కెమెరా బటన్‌ను నొక్కి పట్టుకుంటేనే వీడియో రికార్డ్ అయ్యేది. దీంతో వీడియో రికార్డు చేస్తున్నంతసేపు యూజర్ల వేలు కెమెరా బటన్‌పై ఉంచాల్సి వచ్చేది. తాజాగా ఈ సమస్యకు పరిష్కారంగా కెమెరా సెక్షన్‌లో వీడియో మోడ్ (Video Mode) అనే ఫీచర్‌ను పరిచయం చేసింది. దీంతో యూజర్లు కెమెరా ఓపెన్ వీడియో మోడ్ సెలెక్ట్ చేసి రికార్డింగ్ బటన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం కొద్ది మంది యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఒకవేళ మీకు రాకుంటే వాట్సాప్ యాప్ అప్‌డేట్ చేసి చూడండి.
ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్, భద్రతాపరమైన చర్యల్లో భాగంగా వాట్సాప్ రేపటి నుంచి (ఫిబ్రవరి 1 తేదీ) కొన్నిస్మార్ట్‌ఫోన్ల (Smartphones)లో తన సేవలను నిలిపివేయనుంది. ఈ నిర్ణయంతో వాట్సాప్ కొత్తగా విడుదల చేసే ఫీచర్, సెక్యూరిటీ అప్‌డేట్‌లు రావని తెలిపింది. ఐఓఎస్ 12, ఆండ్రాయిడ్ 4.0.3 కన్నా ముందు వెర్షన్ ఓఎస్‌లతో పనిచేస్తున్న ఫోన్లలో ఇకపై వాట్సాప్ పనిచేయదని వెల్లడించింది.
ఈ నిర్ణయంతో ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్, ఐఫోన్ ఎస్ (ఫస్ట్ జనరేషన్), శాంసంగ్ గెలాక్సీ సిరీస్ (కోర్, ట్రెండ్ లైట్, ఏస్ 2, ఎస్3 మినీ, ట్రెండ్ వన్‌ఐ, ఎక్స్ కవర్ 2), వింకో (డార్క్‌నైట్, సింక్ ఫైవ్), ఆర్కోస్ 53 ప్లాటినమ్, జెడ్‌టీఈ (వీ956-యుమీ ఎక్స్2, గ్రాండ్ ఎస్ ఫ్లెక్స్, మెమో), హువావే (అసెండ్ మేట్, అసెండ్ జీ740, డీ2), ఎల్‌జీ ( ఎల్ సిరీస్, ఎఫ్ సిరీస్, యాక్ట్, లూసిడ్ 2) సోనీ ఎక్స్‌పిరీయా ఎమ్, లెనోవా ఏ820 మోడల్స్‌లో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Technology News
Legacy Contact: వారసత్వ నంబరు ఎలా?
-
Movies News
Mrunal Thakur: ‘నా కథను అందరితో పంచుకుంటా..’ కన్నీళ్లతో ఉన్న ఫొటో షేర్ చేసిన మృణాల్
-
World News
Earthquake: పాక్, అఫ్గాన్‌లో భూకంపం.. 11 మంది మృతి..!
-
Ts-top-news News
RTC Cargo: తూచింది 51 కేజీలు.. వచ్చింది 27 కేజీలు.. ఆర్టీసీ కార్గో నిర్వాకం
-
Movies News
Anasuya: ప్రెస్మీట్లో కన్నీరు పెట్టుకున్న అనసూయ
-
World News
నీటి లోపల వంద రోజులు జీవిస్తే.. ప్రొఫెసర్ ఆసక్తికర ప్రయోగం!