whatsapp: వీడియో కాల్‌ షేరింగ్‌

ఎప్పటికప్పుడు వినూత్న ఫీచర్లతో అలరించే వాట్సప్‌ మరిన్ని కొత్త సదుపాయాలు అందుబాటులోకి తేనుంది. తాజాగా వీడియో కాలింగ్‌ అనుభూతిని ఇనుమడింప జేయటంపై దృష్టి సారించింది.

Updated : 31 May 2023 02:57 IST

ఎప్పటికప్పుడు వినూత్న ఫీచర్లతో అలరించే వాట్సప్‌ మరిన్ని కొత్త సదుపాయాలు అందుబాటులోకి తేనుంది. తాజాగా వీడియో కాలింగ్‌ అనుభూతిని ఇనుమడింప జేయటంపై దృష్టి సారించింది. వాట్సప్‌ కొత్త మార్పులపై నిశితంగా దృష్టి సారించే వాబీటాఇన్ఫో వెబ్‌సైట్‌ ప్రకారం.. వీడియోకాల్‌ చేస్తుండగానే తేలికగా స్క్రీన్‌ను షేర్‌ చేసుకునే ఫీచర్‌ రానుంది. ప్రస్తుతం దీన్ని ఆండ్రాయిడ్‌ బీటా టెస్టర్లకు అందుబాటులో ఉంచారు. వాట్సప్‌ బీటా 2.23.11.19 ఆండ్రాయిడ్‌ వర్షన్‌ గలవారు దీన్ని పరీక్షించుకోవచ్చు. వీడియోకాల్‌ చేస్తున్నప్పుడు కాల్‌ కంట్రోల్‌ వ్యూలో కొత్త గుర్తు కనిపిస్తుంది. ఇది స్క్రీన్‌ షేరింగ్‌కు వీలు కల్పిస్తుంది. దీన్ని ఎంచుకుంటే తెర మీద కనిపించే దృశ్యాలు రికార్డు అవుతాయి. అవి అవతలివారికి ప్రసార మవుతాయి. ఒకవేళ మధ్యలో ఎక్కడైనా ఆపాలనుకుంటే పాజ్‌ చేసుకోవచ్చు. అయితే దృశ్యాలను షేర్‌ చేయటానికి అనుమతి ఇచ్చినవారికే ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 2.23.11.19 వర్షన్‌కు అప్‌డేట్‌ చేసుకున్నాక నావిగేషన్‌ బార్‌లో కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే చాలు. వాడు కోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని