ఎన్నికల ప్రచారంలో నిర్లక్ష్యం వద్దు

Eenadu icon
By Telangana News Desk Published : 28 Oct 2025 04:17 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

జూబ్లీహిల్స్‌లో విజయం సాధించాలి
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌

సమావేశంలో ప్రసంగిస్తున్న మహేశ్‌కుమార్‌గౌడ్‌. హాజరైన సంపత్‌కుమార్, భట్టి, వేం నరేందర్‌రెడ్డి, పొన్నం, మీనాక్షి, విశ్వనాథన్‌ తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో ఎవరూ నిర్లక్ష్యం చూపొద్దని.. కాంగ్రెస్‌ విజయం సాధించేందుకు అందరూ కష్టపడి పనిచేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ సూచించారు. ఉప ఎన్నికపై పార్టీ నాయకులతో సోమవారం సాయంత్రం ఇక్కడి హరిత ప్లాజాలో నిర్వహించిన అంతర్గత సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షీ నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, వివేక్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, సంపత్‌కుమార్, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, పర్నికారెడ్డి, యశస్వినీరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహేశ్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ.. నాయకులందరూ ఐక్యంగా కృషి చేసి అధిక మెజార్టీ తీసుకురావాలన్నారు. ‘నేతలు కేవలం 20 నుంచి 25 మంది కార్యకర్తలతో కలసి ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరునూ కలసి ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను వివరించి ఓటు అడగాలి. పెద్దసంఖ్యలో అనుచరులతో తిరుగుతూ హడావుడి చేయొద్దు’ అని సూచించారు. మీనాక్షీ నటరాజన్‌ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారాన్ని పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు