
TS news : శిలాఫలకం ధ్వంసం.. ఆత్మకూరులో ఉద్రిక్తత
ఆత్మకూరు: హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రం పహాడ్ సమ్మక్క సారలమ్మ జాతర నూతన పాలక మండలి ప్రమాణస్వీకార కార్యక్రమం రసాభాసగా మారింది. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. జాతర ప్రాంగణంలో ఉన్న శిలాఫలకాన్ని తొలగించాలని ఆదేశించారు. దీంతో అక్కడే ఉన్న తెరాస నేత మోరే మహేందర్ గునపంతో ధ్వంసం చేశారు. దీంతో తెరాస, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. 2010లో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు, ఆయన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం జాతరకు కొంత భూమిని దానం చేశారు. ఆ స్థలంలో ఓ శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా దాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం సంఘటన స్థలాన్ని మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత పటేల్ పరిశీలించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.