
ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ జీవిత సాఫల్యపురస్కారానికి ఇండ్ల రామసుబ్బారెడ్డి ఎంపిక
విజయవాడ (సూర్యారావుపేట), న్యూస్‌టుడే : విజయవాడకు చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు, ఇండ్లాస్ విమ్‌హాన్స్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డిని ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక చేశారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఏటా ‘డాక్టర్ జె.కె.త్రివేది జీవన సాఫల్య పురస్కారం’ నిమిత్తం దేశవ్యాప్తంగా 10వేలకు పైగా ఉన్న మానసిక వైద్యుల నుంచి ఒకరిని ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరానికి డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డిని ఎంపిక చేశారు. విశాఖపట్నంలో శనివారం రాత్రి నిర్వహించిన జాతీయ సైకియాట్రిక్ సొసైటీ సర్వసభ్య సమావేశంలో ఈ అవార్డును ప్రకటించారు. జాతీయస్థాయిలో మానసిక వైద్యరంగానికి డాక్టర్ ఇండ్ల చేసిన సేవలు, పరిశోధనలు, జాతీయ అంతర్జాతీయ జర్నల్స్‌లో ఆయన ప్రచురించిన పరిశోధనాపత్రాలు, నిర్వహించిన సదస్సులను గుర్తించి, ఈ అవార్డుకు ఆయనను ఎంపిక చేశారు. వచ్చే ఏడాది జనవరిలో భువనేశ్వర్‌లో జరిగే జాతీయ సైకియాట్రిక్ సొసైటీ సర్వసభ్య సమావేశంలో ఈ అవార్డు అందచేస్తారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.