కేసీఆర్‌పై అన్ని వర్గాల్లో వ్యతిరేకత

రాష్ట్రంలో అన్ని వర్గాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వ్యతిరేకత నెలకొందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ అన్నారు. దిల్లీలోని తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌

Published : 28 Jan 2022 04:08 IST

భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌

ఈనాడు, దిల్లీ: రాష్ట్రంలో అన్ని వర్గాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వ్యతిరేకత నెలకొందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ అన్నారు. దిల్లీలోని తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ పాలనపై ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయన్నారు. ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేకనే భాజపా నేతలపై వరుస దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. తాజాగా ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై, గతంలో తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వాటిని ప్రజాస్వామికంగా, రాజకీయంగా ఎదుర్కొంటామని చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 98, ఉత్తరాఖండ్‌లో 70 శాసనసభ స్థానాల్లో ప్రచార బాధ్యతను పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా తనకు అప్పగించారని, ఆ స్థానాల్లో ప్రచారంలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాల్లో ప్రజలు భాజపాకు అనుకూలంగా తీర్పు ఇవ్వబోతున్నారని లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని