తేమ కూడా తేల్చలేమా!

పంట అమ్ముకునే క్రమంలో రైతన్నలకు ఎన్ని కష్టాలో! రోజుల తరబడి ధాన్యం ఆరబెట్టారు. తూకం ఎప్పుడోనని రాత్రింబవళ్లు పడిగాపులు కాశారు. ఎట్టకేలకు తూకం చేశారు. లారీ నింపారు. ‘హమ్మయ్యా.. అంటూ రైతు ఊపిరి పీల్చుకోనేలోపే వెళ్లిన లారీ కొద్ది

Published : 02 Dec 2021 04:55 IST

309 సంచుల ధాన్యం వెనక్కి పంపిన మిల్లరు

లారీ నుంచి సంచులను కిందకు దింపి పట్టాపై ధాన్యం పోస్తున్న కూలీలు

జుక్కల్‌, న్యూస్‌టుడే: పంట అమ్ముకునే క్రమంలో రైతన్నలకు ఎన్ని కష్టాలో! రోజుల తరబడి ధాన్యం ఆరబెట్టారు. తూకం ఎప్పుడోనని రాత్రింబవళ్లు పడిగాపులు కాశారు. ఎట్టకేలకు తూకం చేశారు. లారీ నింపారు. ‘హమ్మయ్యా.. అంటూ రైతు ఊపిరి పీల్చుకోనేలోపే వెళ్లిన లారీ కొద్ది గంటల్లోనే వెనక్కు వచ్చేసింది. పది, పాతిక కాదు.. ఏకంగా 309 సంచుల (ఒక్కో బస్తాలో 41.5 కిలోల) ధాన్యం తేమ ఎక్కువ ఉందంటూ మిల్లరు వెనక్కి పంపారు. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండలంలోని కౌలాస్‌ గ్రామానికి చెందిన ఓ రైతు ఎనిమిదెకరాల్లో సన్న బియ్యం పండించారు. తూకానికి ముందే సొసైటీలో తేమ శాతం పరిశీలించాలి. ఎక్కువుంటే ఇంకా ఆరబెట్టాలి. జుక్కల్‌ సొసైటీ నిర్వాహకులు అదేమీ లేకుండా తూకం వేసి సంచుల్లో నింపి, లారీల్లో వేసి రైస్‌ మిల్లుకు పంపేశారు. తీరా అక్కడకు వెళ్లాక 30 శాతం తేమ ఉందంటూ వెనక్కు పంపేశారు. లారీ కిరాయి, హమాలీ కూలీ ఖర్చుల కింద రైతుకు రూ.15 వేల వరకు నష్టం వాటిల్లింది. ఈ విషయమై జక్కల్‌ సొసైటీ కార్యదర్శి బాబూరావును వివరణ కోరగా, పని ఒత్తిడిలో పొరపాటు జరిగిందని, రెండురోజుల్లో ఆ రైతు ధాన్యాన్ని మళ్లీ కాటా వేసి మిల్లుకు పంపిస్తామని చెబుతుండడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని