ఛార్జీలు పెంచినా.. ప్రయాణం ఖర్చు తక్కువే

ప్రయాణికులపై భారం మోపాలన్న ఆలోచన లేకున్నా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఛార్జీలు పెంచక తప్పడం లేదని తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ) వీసీ సజ్జనార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఛార్జీలు పెంచినా.. ఇతర

Published : 04 Dec 2021 05:16 IST

ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రయాణికులపై భారం మోపాలన్న ఆలోచన లేకున్నా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఛార్జీలు పెంచక తప్పడం లేదని తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ) వీసీ సజ్జనార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఛార్జీలు పెంచినా.. ఇతర ప్రయాణ సాధనాలతో పోలిస్తే ఆర్టీసీ ప్రయాణ ఖర్చు తక్కువే అన్నారు. ‘‘దేశంలోని అన్ని ప్రజారవాణా సంస్థలు ఛార్జీలు పెంచాయి. కరోనా తీవ్రస్థాయిలో ఉన్న సమయంలోనూ వివిధ వర్గాల కార్మికులను గమ్యాలకు చేర్చడం మొదలు ఆక్సిజన్‌ సిలిండర్ల రవాణా వరకు ఆర్టీసీ సేవలందించింది. కరోనాతో 251 మంది కార్మికులను కోల్పోయాం. 2019లో ఛార్జీలు పెంచినప్పటి నుంచి ఇప్పటి వరకు డీజిల్‌ ఛార్జీలు 27.5 నుంచి 34 శాతం పెరిగాయి. కరోనా ఆంక్షలను సడలించిన తొలినాళ్లలో 20 శాతం మంది ప్రజలే బస్సుల్లో ప్రయాణించారు. నేడు పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ఛార్జీల స్వల్ప పెంపును ప్రజలు అర్థం చేసుకుని ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలి’’ అని ఆ ప్రకటనలో వీసీ సజ్జనార్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని