ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కరోనా మూడో దశను సమర్థంగా అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, చాలా వరకు హోమ్‌ ఐసొలేషన్‌ కిట్‌తోనే దానికి అడ్డుకట్ట వేయొచ్చని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. అయినా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని

Published : 20 Jan 2022 06:07 IST

 వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు

గజ్వేల్‌, న్యూస్‌టుడే: కరోనా మూడో దశను సమర్థంగా అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, చాలా వరకు హోమ్‌ ఐసొలేషన్‌ కిట్‌తోనే దానికి అడ్డుకట్ట వేయొచ్చని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. అయినా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కొవిడ్‌ నియంత్రణ కోసం రాష్ట్రంలో 2 కోట్ల కరోనా పరీక్ష కిట్లు, 1 కోటి ఐసొలేషన్‌ వస్తువుల కిట్లు సిద్ధంగా ఉంచామన్నారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేశారు. అక్కడ అందుతోన్న వైద్యసేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్య పరీక్షల కోసం వేచిచూస్తున్న పలువురు మహిళలతో మాట్లాడి, ఆసుపత్రిలో అందుతున్న సేవల తీరుతెన్నులపై ఆరా తీశారు. ఆపై కరోనా పరీక్షల కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. కొవిడ్‌ రోగులకు అవసరమైన కరోనా కిట్లు పెద్ద ఆసుపత్రుల్లోనే కాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ అందుబాటులో ఉంచామన్నారు. గజ్వేల్‌ ప్రభుత్వాసుపత్రిలో నెలకు 400 ప్రసవాలు జరుగుతుండటం విశేషమన్నారు. ఇందుకు కృషిచేస్తున్న సూపరింటెండెంట్‌, సిబ్బందిని మంత్రి అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని