
Published : 22 Jan 2022 04:58 IST
ఆన్‌లైన్ తరగతులు నిర్వహించండి
ప్రిన్సిపాళ్లకు ఇంటర్ విద్యాశాఖ ఆదేశాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కళాశాలలకు సెలవులను పొడిగించిన నేపథ్యంలో ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లోని విద్యార్థులకు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆన్‌లైన్/జూమ్ తరగతులు నిర్వహించాలని, టీశాట్ పాఠాలను పర్యవేక్షించాలని ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ జలీల్ ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్లు, బోధనేతర సిబ్బంది కళాశాలలకు వచ్చి హాజరు రిజిస్టర్లలో సంతకాలు చేయాలని సూచించారు.
Advertisement
Tags :