
14 మందికి ఎన్నికల సంఘం అవార్డులు
ఈనాడు, హైదరాబాద్: ఎన్నికల నిర్వహణలో ఉత్తమ విధానాలు పాటించిన 14 మంది అధికారులకు ఎన్నికల సంఘం అవార్డులు ప్రకటించింది. వీటిని జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న ఆయా జిల్లా ఎన్నికల అధికారుల ద్వారా అందజేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ అధికారిగా నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ ఎంపికయ్యారు. ప్రత్యేక అవార్డుల విభాగంలో సీహెచ్ రవీందర్‌రెడ్డి(ఆర్డీవో, హుజూరాబాద్), బి.రోహిత్‌సింగ్(ఆర్డీవో, మిర్యాలగూడ), డి.కొమరయ్య(ఆర్డీవో, మహబూబాబాద్), బి.లక్ష్మణ్(ఓటరు చైతన్యం విభాగం నోడల్ అధికారి, ఆదిలాబాద్), ఎం.విజయ్‌కుమార్(నాయిబ్ తహసీల్దార్, నల్గొండ) ఎంపికయ్యారు. పోలింగ్ కేంద్రం స్థాయి అధికారుల విభాగంలో అనిత(బోధన్), కె.శ్రీవాస్తవ(మహబూబాబాద్) ఉన్నారు. ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయంలోని ఎ.ప్రసాద్, ఆర్.శ్రీనాథ్, టి.హరీశ్, బి.రాఘవ, రవీందర్, జయరాజ్ కూడా పురస్కారాలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు.
Advertisement