జలవనరులు, మౌలిక వసతులఅభివృద్ధి సంస్థకు ‘ఎ’ కేటగిరి

తెలంగాణ రాష్ట్ర జల వనరులు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థను (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐడీసీ) కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ) ‘ఎ’ కేటగిరి కింద గుర్తించింది. 2018లో ఏర్పాటైన

Updated : 25 Jan 2022 05:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర జల వనరులు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థను (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐడీసీ) కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ) ‘ఎ’ కేటగిరి కింద గుర్తించింది. 2018లో ఏర్పాటైన ఈ సంస్థ సీతారామ, దేవాదుల ఎత్తిపోతల పథకాలు, కంతనపల్లి ప్రాజెక్టు, వరద కాల్వ (ఎస్సారెస్పీ) పనుల్లో ప్రమాణాల మేరకు నిధులను వినియోగించడంలో ఉత్తమ పనితీరు నమోదు చేసినట్లు ఆర్‌ఈసీ పేర్కొంది. 2021లో సీతమ్మసాగర్‌ మల్టీపర్పస్‌ ప్రాజెక్టును కూడా ఈ కార్పొరేషన్‌ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ‘ఎ’ గ్రేడు దక్కించుకున్నందుకు కార్పొరేషన్‌ ఎండీ బి.శంకర్‌ను నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, ఈఎన్‌సీ మురళీధర్‌ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని