Telangana News: 1-9 తరగతుల పరీక్షలు వాయిదా

పరీక్షలకు కేవలం వారం రోజుల ముందుగా 1-9 తరగతుల సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎస్‌ఏ-2) కాలపట్టిక జారీ చేయడంపై విమర్శలు రావడంతో విద్యాశాఖ వాటిని వాయిదా

Updated : 01 Apr 2022 09:26 IST

ఏప్రిల్‌ 16-22ల మధ్య నిర్వహించాలని నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: పరీక్షలకు కేవలం వారం రోజుల ముందుగా 1-9 తరగతుల సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎస్‌ఏ-2) కాలపట్టిక జారీ చేయడంపై విమర్శలు రావడంతో విద్యాశాఖ వాటిని వాయిదా వేసింది. ఏప్రిల్‌ 7 నుంచి పరీక్షలు జరుగుతాయని బుధవారం రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) కాలపట్టికను విడుదల చేసింది. దీనిపై ‘పరీక్షలకు వారం ముందు కాలపట్టిక’ అనే శీర్షికన ‘ఈనాడు’లో వార్త ప్రచురితం కావడంతో ప్రభుత్వం ఎస్‌సీఈఆర్‌టీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కాలపట్టికను జారీ చేయడం ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించినట్లు తెలిసింది. వారం రోజుల్లో ప్రశ్నపత్రాలను ముద్రించి ఎలా పాఠశాలలకు చేరుస్తారు? అని అడిగినట్లు సమాచారం. దాంతో ఎస్‌సీఈఆర్‌టీ సంచాలకురాలు రాధారెడ్డి పరీక్షలను వాయిదా వేసి ఏప్రిల్‌ 16 నుంచి 22 వరకు జరపాలని నిర్ణయించినట్లు గురువారం రాత్రి 10 గంటలకు  ప్రకటించారు. ఆ ప్రకారం కాలపట్టికను విడుదల చేశారు. పరీక్షలు ముగిసిన మరుసటి రోజు(23వ తేదీ)న ఫలితాలు వెల్లడించాలి. పాఠశాలలకు ఆరోజే చివరి పనిదినం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని