Hyderabad Zoo Park: మృగ‘రాజు’ చెంత వజ్రాల వింత.. జూలోకి వెళ్లి వెతకబోయాడంట!

కీసరకు చెందిన ఇతడి పేరు జి.సాయికుమార్‌(31). కొంతకాలంగా మానసిక స్థితి సరిగా లేదు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో తెలిసిన వ్యక్తుల వద్ద పూట గడుపుతుంటాడు. మంగళవారం సాయంత్రం జూకు వచ్చిన అతడు ఆఫ్రికా జాతి సింహాల ఎన్‌క్లోజరు వద్దకు చేరుకున్నాడు. అరగంటసేపు అక్కడే ఉన్నాడు. తర్వాత ప్రహరీ పైకి ఎక్కాడు. తన

Updated : 24 Nov 2021 05:55 IST

కీసరకు చెందిన ఇతడి పేరు జి.సాయికుమార్‌(31). కొంతకాలంగా మానసిక స్థితి సరిగా లేదు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో తెలిసిన వ్యక్తుల వద్ద పూట గడుపుతుంటాడు. మంగళవారం సాయంత్రం జూకు వచ్చిన అతడు ఆఫ్రికా జాతి సింహాల ఎన్‌క్లోజరు వద్దకు చేరుకున్నాడు. అరగంటసేపు అక్కడే ఉన్నాడు. తర్వాత ప్రహరీ పైకి ఎక్కాడు. తన చేతిలోని ఓ కాగితాన్ని లోపలికి విసిరాడు. అక్కడున్న ఆఫ్రికన్‌ జాతి సింహం ఒకటి భయంకరంగా గర్జిస్తూ అతడున్న గోడపైకి ఎగబాకడానికి ప్రయత్నించింది. ఏమాత్రం కాలు జారినా అతడు నేరుగా లోపల పడి సింహం నోటికి చిక్కేవాడే. ఇదంతా చూసి జూకు వచ్చిన సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. ఈ అలజడికి జంతు సంరక్షులు యశ్వంత్‌, మహేశ్‌, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. చాకచక్యంగా అతన్ని కిందకు తీసుకువచ్చారు. అనంతరం బహదూర్‌పుర పోలీసులకు అప్పగించారు. ఓ హోటల్‌లో టీ తాగుతుండగా ‘సింహం వద్ద వజ్రాలుంటాయంటూ’ కొంతమంది చెప్పుకోవడం విన్నానని, వాటి కోసమే ఇలా చేశానని సాయికుమార్‌ చెప్పాడు. నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన ముఖేష్‌(35) అనే వ్యక్తి 2014లో ఇలాగే అందరూ చూస్తుండగా జూలోని సింహాల ఎన్‌క్లోజరులోకి దూకాడు. రెండు సింహాలు అతన్ని వేటాడడానికి ప్రయత్నిస్తుండగా సంరక్షకులు చాకచక్యంగా వాటిని తరిమి అతడిని రక్షించారు. సింహంతో పోరాడి తన బలాన్ని నిరూపించుకోడానికే దిగానని అతడు పోలీసులు విచారణలో తెలియజేశాడు. అతడికి కూడా మానసిక స్థితి సరిగా లేదని తేలింది.

- న్యూస్‌టుడే, చార్మినార్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని