జూనియర్‌ కళాశాలలుగా 86 గురుకుల పాఠశాలలు

రాష్ట్రంలోని 86 సంక్షేమ గురుకుల పాఠశాలల్ని జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నతీకరణ ఈ విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

Published : 02 Jul 2022 04:15 IST

ఈ విద్యాసంవత్సరం నుంచే అమలుకు ప్రభుత్వ నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 86 సంక్షేమ గురుకుల పాఠశాలల్ని జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నతీకరణ ఈ విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల నుంచి జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేసిన వాటిలో 75 ఎస్సీ, 7 ఎస్టీ, 4 బీసీ గురుకులాలు ఉన్నాయి. శుక్రవారమిక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ముఖ్యకార్యదర్శులు, గురుకుల సొసైటీల కార్యదర్శులతో సీఎస్‌ సమావేశమయ్యారు. వెంటనే అప్‌గ్రేడ్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జిల్లాల్లో శాశ్వత స్టడీసర్కిళ్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కూడా సీఎం ఆదేశించారన్నారు. గురుకులాల్లో పరిశుభ్రత, ఆహార నాణ్యతకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని