రాయదుర్గం భూములపై ప్రభుత్వ పిటిషన్‌ కొట్టివేత

రాయదుర్గంలోని సర్వే నం.234లోని 84 ఎకరాల భూమికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌ 22న ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం హైకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్‌పై వాదనలను

Updated : 27 Sep 2022 06:02 IST

తీర్పు వెలువరించిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: రాయదుర్గంలోని సర్వే నం.234లోని 84 ఎకరాల భూమికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌ 22న ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం హైకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్‌పై వాదనలను విన్న జస్టిస్‌ జి.శ్రీదేవి, జస్టిస్‌ ఎం.జి.ప్రియదర్శినిలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. ఈ భూములకు సంబంధించి లింగమయ్య, బూర్గుల రామకృష్ణ తదితరులు దాఖలు చేసిన పునః సమీక్ష పిటిషన్‌ విచారణార్హతను మాత్రమే పరిశీలిస్తున్నామని చెప్పి ఏకంగా హక్కులకు సంబంధించి తీర్పు వెలువరించిందని ప్రభుత్వం వాదన వినిపించింది. నోటీసులు ఇచ్చి తమ వాదనలను వినాల్సి ఉందన్న వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రైవేటు పార్టీలు కొన్ని పత్రాలను సృష్టించి కోర్టుకు సమర్పించారని, అయితే వాటిని పరిశీలిస్తే అవి నకిలీవని తేలిందన్న వాదనకు ఆధారాలు లేవంది. రివ్యూ పిటిషన్‌లో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్న ప్రైవేటు వ్యక్తుల వాదనను సమర్థించింది. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం గత తీర్పును వెనక్కి తీసుకోలేమని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని