అదే పువ్వు.. మువ్వన్నెలు రువ్వు!

ఒకే పుష్పం ఒకేరోజు మూడు వర్ణాల్లో మెరిసింది. ఉదయం 8 గంటలకు తెల్లగా, మధ్యాహ్నం గులాబీ, సాయంత్రం ఎరుపు రంగులోకి మారింది.

Published : 28 Nov 2022 03:59 IST

ఒకే పుష్పం ఒకేరోజు మూడు వర్ణాల్లో మెరిసింది. ఉదయం 8 గంటలకు తెల్లగా, మధ్యాహ్నం గులాబీ, సాయంత్రం ఎరుపు రంగులోకి మారింది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాకలోని కోమనేని రఘు నివాసంలో శనివారం ఈ మందార జాతి పువ్వు వికసించింది. ఈ మొక్కను హైబిస్కస్‌ ముటాబిలిస్‌ అని పిలుస్తారు. దీనినే కాన్ఫెడరేట్‌ రోజ్‌ మల్లో, డిక్సీ రోజ్‌ మల్లో, కాటన్‌ రోజ్‌ మల్లోగానూ వ్యవహరిస్తారని, మొక్కను నాలుగేళ్లుగా పెంచుతున్నానని రఘు చెప్పారు. తొలిసారి 2021 అక్టోబరులోనూ.. తాజాగా మళ్లీ రెండోసారి శనివారం పూసిందన్నారు. ఏడాదికోసారి పుష్పించే ఈ మొక్కలను చైనా, తైవాన్‌ దేశాల్లో పెంచుతారని వివరించారు.

- న్యూస్‌టుడే, శాయంపేట (హనుమకొండ)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని