Yadagirigutta: ఆలయ ప్రయాణంలో తప్పని ప్రయాస!

యాదాద్రి దివ్యక్షేత్రంలో ఆర్టీసీ అధికారుల తీరుతో భక్తులకు ఆయాసం తప్పటం లేదు. కొండ కింద బస్‌స్టేషన్‌ నుంచి కొండపైకి చేరాలంటే రెండు బస్సులు ఎక్కాల్సిందే. రెండు నిమిషాలకో బస్సు ఉందంటున్న మాట మూణ్నాళ్ల ముచ్చటగా మారింది.

Published : 19 Dec 2022 07:09 IST

కొండపైకి వెళ్లాలంటే రెండు బస్సులు మారాల్సిందే

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి దివ్యక్షేత్రంలో ఆర్టీసీ అధికారుల తీరుతో భక్తులకు ఆయాసం తప్పటం లేదు. కొండ కింద బస్‌స్టేషన్‌ నుంచి కొండపైకి చేరాలంటే రెండు బస్సులు ఎక్కాల్సిందే. రెండు నిమిషాలకో బస్సు ఉందంటున్న మాట మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. కనుమదారుల్లో మరమ్మతుల దృష్ట్యా బస్సులు కొండ చుట్టూ తిరగాల్సి వస్తోంది. నేరుగా కొండపైకి చేర్చకుండా భక్తులను కొండ కింద పుష్కరిణి, కల్యాణకట్ట, వ్రత మండపాల వద్దే దింపేస్తున్నారు. అక్కడి నుంచి మరో బస్సెక్కి కొండపైకి వెళ్లాల్సి వస్తోంది. నేరుగా గుడికెళ్లాలనుకునే భక్తులకు, పిల్లాపాపలు, వృద్ధులతో వచ్చే కుటుంబికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సకాలంలో బస్సులు రాక, వచ్చిన దాంట్లోనే సామర్థ్యానికి మించి పయనించాల్సి వస్తోంది. ఆర్థిక భారం తగ్గించుకునే యోచనతో అధికారులు బస్సుల సంఖ్యను తగ్గిస్తున్నట్లు భక్తులు వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు