Yadadri: యాదాద్రిలో భారీ స్వాగత తోరణం

యాదాదిలో నిర్మితమైన భారీ స్వాగత తోరణం వచ్చే ఫిబ్రవరిలో వార్షిక బ్రహ్మోత్సవాల్లోపు ఆవిష్కృతం కానుంది. 

Updated : 10 Jan 2023 08:02 IST

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాదిలో నిర్మితమైన భారీ స్వాగత తోరణం వచ్చే ఫిబ్రవరిలో వార్షిక బ్రహ్మోత్సవాల్లోపు ఆవిష్కృతం కానుంది. కొండపైకి వెళ్లే కనుమదారులను కలుపుతూ వాటి మధ్య వైష్ణవతత్వం ప్రస్ఫుటించేలా కొండపైన పంచనారసింహుల ప్రాంగణానికి చేరే దిశలో.. కొండ దిగేటప్పుడు తోరణంపైన వెనకా, ముందు శ్రీ లక్ష్మీనరసింహస్వామి రూపం.. ఇరువైపులా గరుడాళ్వారుడు, ఆంజనేయస్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. తోరణానికి ఇరువైపులా ద్వారపాలకులు, మధ్యలో మహావిష్ణుమూర్తి రూపం, కింది భాగంలో యక్షులు దర్శనమిస్తారు. స్వాగత తోరణం కుడివైపున రక్షణ గోడపైన  ఐరావతం, తీర్థజనుల దృశ్యాలను తీర్చిదిద్దారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని