ఘనంగా మేడారం చిన్నజాతర ప్రారంభం

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వనదేవతల మండమెలిగె పండగ (చిన్న జాతర) బుధవారం ఘనంగా ఆరంభమైంది.

Published : 02 Feb 2023 05:22 IST

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, తాడ్వాయి, న్యూస్‌టుడే: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వనదేవతల మండమెలిగె పండగ (చిన్న జాతర) బుధవారం ఘనంగా ఆరంభమైంది. ఉదయాన్నే మేడారంలోని సమ్మక్క పూజా మందిరాన్ని, కన్నెపల్లిలోని సారలమ్మ గుడిని పూజారులు శుద్ధి చేశారు. పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి మేడారం, కన్నెపల్లి నుంచి అమ్మవార్ల అడేరాలు, ఇతర పూజా సామగ్రితో డోలు వాయిద్యాల మధ్య నృత్యాలు చేసుకుంటూ గద్దెల ప్రాంగణానికి చేరుకుని పూజలు నిర్వహించారు. గురువారం ఉదయం అమ్మవార్ల అడేరాలను తిరిగి ఆయా ఆలయాలకు చేర్చుతారు. శనివారం వరకు జాతర కొనసాగనుంది. జాతర తొలిరోజు వివిధ ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. మంత్రి సత్యవతి రాథోడ్‌, ములుగు కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, ఎస్పీ గౌస్‌ ఆలం, జడ్పీ ఛైర్మన్‌ జగదీశ్వర్‌ తదితరులు అమ్మవార్లను దర్శించుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు