విదేశాల్లో యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు

తెలంగాణ యువతకు విదేశాల్లో మరిన్ని ఉద్యోగాల కల్పనకు పాలకమండలి నిర్ణయం తీసుకుంది. దీనికోసం అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాలని తీర్మానించింది.

Published : 28 Mar 2023 04:24 IST

ఏడు సంస్థలతో ఒప్పందాలు 
టామ్‌కామ్‌ పాలకమండలి నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ యువతకు విదేశాల్లో మరిన్ని ఉద్యోగాల కల్పనకు పాలకమండలి నిర్ణయం తీసుకుంది. దీనికోసం అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాలని తీర్మానించింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధ్యక్షతన సోమవారం ఆయన కార్యాలయంలో టామ్‌కామ్‌ పాలకమండలి సమావేశం జరిగింది. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, హోంశాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్‌, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి దాసరి బాలయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు. వివిధ దేశాల నుంచి డిమాండ్ల దృష్ట్యా జాతీయ నిర్మాణ సంస్థ(న్యాక్‌), జాతీయ పర్యాటక ఆతిథ్య సంస్థ(నిథమ్‌), జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ (ఎన్‌ఎస్‌టీఐ), న్యూఫౌండ్‌ ల్యాండ్‌, కెనడా ప్రభుత్వ ఉపాధి శాఖలతో ఒప్పందాలకు అనుమతించింది. విదేశీ ఉద్యోగాలపై పోలీసు అధికారులు, జిల్లా ఉపాధి అధికారులు, రిక్రూటింగ్‌ ఏజెంట్లు రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను, సెమినార్లను నిర్వహించాలని నిర్ణయించింది. విదేశాలకు ఎక్కువ వలసలున్న జిల్లాల్లో ప్రవాస వనరుల కేంద్రాల (మైగ్రేట్‌ రిసోర్స్‌ సెంటర్‌)ను ఏర్పాటు చేయాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని