9.14 లక్షల ఓట్ల తొలగింపు

రాష్ట్రంలో 9,14,354 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించామని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 27 Mar 2024 03:59 IST

రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 9,14,354 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించామని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు ఓట్ల తొలగింపు, సవరణల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను సోమవారానికి పూర్తి చేసినట్లు వెల్లడించారు. ‘మొత్తం 7,31,573 దరఖాస్తులకు సంబంధించిన సవరణను పూర్తిచేశాం. నూతనంగా ఓటరు నమోదుతోపాటు ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ఓటు మార్చుకునేందుకు వచ్చే నెల 15 వరకు గడువు ఉంది. సోమవారం నాటికి రాష్ట్రంలో 3,30,13,318 మంది ఓటర్లు నమోదయ్యారు. వారిలో 1,65,95,896 మంది మహిళలు కాగా, 1,64,14,693 మంది పురుషులు, 2,729 మంది ఇతరులు. 18-19 సంవత్సరాల తొలితరం ఓటర్లు 8,72,116 మంది నమోదు అయ్యారు. 85 సంవత్సరాలు దాటిన వారు 1,93,489 మంది, దివ్యాంగులు 5,26,286 మంది, సర్వీసు ఓటర్లు 15,472 మంది, ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 3,409 మంది ఉన్నారు’ అని వికాస్‌రాజ్‌ తెలిపారు.

భారీగా నగదు స్వాధీనం

పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో గడచిన వారం రోజుల్లో.. ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకూ రాష్ట్రంలో మొత్తం రూ.38,12,34,123 విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఆదాయపన్నుశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో రూ.9,01,67,748 నగదు, రూ.3,34,10,277 విలువైన మద్యం, రూ.13,66,97,895 విలువైన మత్తుమందులు, రూ.8,14,16,506 విలువైన బంగారం, వెండి, వజ్రాల వంటి ఆభరణాలు, రూ.3,95,41,697 విలువైన ఎలక్ట్రానిక్‌ తదితర వస్తువులు ఉన్నాయని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని