కోర్టు ఆవరణలో నిందితులకు సంకెళ్లపై వివరణ ఇవ్వండి

రంగారెడ్డి జిల్లా కూకట్‌పల్లి జిల్లా కోర్టు ఆవరణలో నిందితులకు పోలీసులు సంకెళ్లు వేసి తీసుకురావడంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

Published : 24 Apr 2024 03:39 IST

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా కూకట్‌పల్లి జిల్లా కోర్టు ఆవరణలో నిందితులకు పోలీసులు సంకెళ్లు వేసి తీసుకురావడంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కూకట్‌పల్లి కోర్టు ముందు హాజరుపరిచేందుకు ముగ్గురు నిందితులకు ముగ్గురు పోలీసులు సంకెళ్లు వేసి తీసుకురావటంపై హైకోర్టుకు ఓ సీనియర్‌ న్యాయవాది లేఖ రాశారు. ప్రేమ్‌శంకర్‌ శుక్లా వర్సెస్‌ దిల్లీ కేసులో సుప్రీం కోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేసేలా చూడాలని, మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకునేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, న్యాయమూర్తి జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌లకు నోటీసులు జారీ చేసింది. ఇలాంటి ఘటనల నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో ఆరు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని