ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల జాప్యంపై స్పష్టత ఇవ్వండి

ఆర్టీసీ ఉద్యోగులకు ఏప్రిల్‌ నెల వేతనాలు ఇప్పటికీ ఎందుకు చెల్లించలేదో యాజమాన్యం వివరణ ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్‌ డిమాండ్‌ చేశారు.

Published : 06 May 2024 03:10 IST

సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్‌

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: ఆర్టీసీ ఉద్యోగులకు ఏప్రిల్‌ నెల వేతనాలు ఇప్పటికీ ఎందుకు చెల్లించలేదో యాజమాన్యం వివరణ ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం సుందరయ్య కళానిలయంలో టీఎస్‌ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌(టీఎస్‌డబ్ల్యూఎఫ్‌), సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్‌(సీఐటీయూ), ఆల్‌ ఇండియా రోడ్డు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌(ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌) సంయుక్తాధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండలు తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో నిత్యం విధులు నిర్వహించే డ్రైవర్లు, కండక్టర్లకు అదనంగా వేతన చెల్లింపులు చేయాలని కోరారు. ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య మాట్లాడుతూ.. రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికుల డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో లోక్‌సభ ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో టీఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్‌రావు, రాష్ట్ర కార్యదర్శి రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని