నేడు మన ‘నీడ’ మనకు కనిపించదు!

మనం ఎండలో ఎక్కడికి వెళ్లినా.. కూర్చున్నా.. నిల్చున్నా.. మన నీడ వెన్నంటే ఉంటుంది కదా.. గురువారం మిట్టమధ్యాహ్న సమయంలో మాత్రం అలా ఉండదు.

Updated : 09 May 2024 08:12 IST

ఈనాడు, హైదరాబాద్‌: మనం ఎండలో ఎక్కడికి వెళ్లినా.. కూర్చున్నా.. నిల్చున్నా.. మన నీడ వెన్నంటే ఉంటుంది కదా.. గురువారం మిట్టమధ్యాహ్న సమయంలో మాత్రం అలా ఉండదు. మన నీడ ‘మాయం’ అవుతుంది! ఇలా ఏడాదికి రెండుసార్లు జరుగుతుంది. ఈ ‘శూన్య నీడ’ రోజు సూర్యుడు సరిగ్గా నడినెత్తిపై ఉంటే.. నిటారుగా ఉండే మనిషి, జంతువు లేదా వస్తువు నీడ కనిపించదు. హైదరాబాద్‌లో ఈ శూన్యనీడ దినం గురువారం మధ్యాహ్నం 12.12 గంటలకు ప్రారంభమై.. రెండు, మూడు నిమిషాల వరకూ కొనసాగుతుంది’’ అని హైదరాబాద్‌లోని బి.ఎం.బిర్లా నక్షత్రశాల ప్రతినిధులు బుధవారం తెలిపారు. మేఘాలు కమ్ముకుని వర్షం కురిస్తే మాత్రం శూన్యనీడ కనిపించే అవకాశం ఉండదన్నారు. ఔత్సాహికులు తమ ఫొటోలను birlasc@gmail.com కు పంపించాలని సూచించారు. కాగా, ‘శూన్య నీడ’ను రెండు, మూడు రోజులపాటు.. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు చూడొచ్చని ప్లానెటరీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌ అధ్యక్షుడు రఘునందన్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద బుధవారం శూన్య నీడ ఎలా మారుతుందో విద్యార్థులకు ప్రయోగాత్మకంగా వివరించామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని