డ్రాగన్‌ పండు... పోషకాలు మెండు!

డ్రాగన్‌ ఫ్రూట్‌... ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ విదేశీ పండు చర్చే. ఇప్పుడు మన దగ్గరా వీటిని విస్తారంగా పండిస్తుండటంతో అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. మరి ఇంతకీ ఇది చేసే మేలేంటో తెలుసుకుందామా!

Published : 03 Jul 2024 03:54 IST

డ్రాగన్‌ ఫ్రూట్‌... ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ విదేశీ పండు చర్చే. ఇప్పుడు మన దగ్గరా వీటిని విస్తారంగా పండిస్తుండటంతో అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. మరి ఇంతకీ ఇది చేసే మేలేంటో తెలుసుకుందామా!

  • ఇందులో పీచు, మాంసకృత్తులు, ఇనుము, జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. నిస్సత్తువ నుంచి బయటపడాలంటే ఈ పండు ముక్కలు కాసిని తింటే చాలు. అలానే రక్తహీనతను అధిగమించాలన్నా ఐరన్‌ అధికంగా ఉండే వీటిని తీసుకోవచ్చు. 
  • డ్రాగన్‌ పండులో ఉండే పిటయా అనే పోషకం రోగనిరోధకతను పెంచుతుంది. యాంటీఆక్సిడెంట్లు శరీరానికి హాని చేసే ఫ్రీరాడికల్స్‌ని నాశనం చేసి క్యాన్సర్‌ ముప్పుని అడ్డుకుంటాయట. ఇక, ఇందులోని ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్‌ యాసిడ్, ఆస్కార్బిక్‌ యాసిడ్, ఫైబర్‌ వంటివి చక్కెర స్థాయుల్ని అదుపు చేస్తాయి. ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ని మెరుగుపరుస్తాయి. 
  • ఇక దీని గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు మేలు చేసే కొలెస్ట్రాల్‌ని పెంచితే, మెగ్నీషియం గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నీరు, పీచు సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటమే కాదు.. బరువూ అదుపులో ఉంటుంది.  
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్